ఇప్పటికైనా అర్థం చేసుకుంటారేమో: సన్నీ లియోన్ | I hope people change mindsets about my acting: Sunny Leone | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా అర్థం చేసుకుంటారేమో: సన్నీ లియోన్

Published Sat, Mar 22 2014 1:06 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఇప్పటికైనా అర్థం చేసుకుంటారేమో: సన్నీ లియోన్ - Sakshi

ఇప్పటికైనా అర్థం చేసుకుంటారేమో: సన్నీ లియోన్

రాగిణి ఎంఎంఎస్2 చిత్రం విడుదలైన తర్వాత.. ఇది చూసైనా భారతీయులు తన నటన గురించి అర్థం చేసుకుంటారేమోనని సెక్సిణి సన్నీ లియోన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తనకు కేవలం అంగాంగ ప్రదర్శనే కాదు.. నటన కూడా వచ్చని వాపోతోంది. 'నా నటనను గురించి విమర్శించేవారి, నా గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ల నోళ్లు మూయించగలనో లోనే నాకు తెలియదు. కానీ, ఈ సినిమాలో నన్ను చూసిన తర్వాత మాత్రం నా నటన గురించి వాళ్లు తమ ఆలోచనలు మార్చుకుంటారేమో' అని సన్నీ విలేకరులతో చెప్పింది. ముంబైలోని గైటీ గెలాక్సీ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి ఆమె తన రాగిణి ఎంఎంఎస్2 సినిమా చూసింది.

2012లో జిస్మ్ 2 చిత్రంతో సన్నీ బాలీవుడ్లోకి ప్రవేశించి, గత సంవత్సరం జాక్పాట్లో మెరిసింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. ఆమెకు నటన అంటే ఏంటో తెలియదని కూడా అందరూ అన్నారు. అయినా రాగిణి ఎంఎంఎస్2లో మాత్రం తాను నటిగా చాలా మెరుగుపడ్డానని సన్నీ లియోన్ భావిస్తోంది. కెమెరా ముందుకు రావడానికి తాను మరింత సౌఖ్యంగా భావిస్తున్నట్లు చెప్పింది. ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం షూటింగ్ సమయంలో తన శరీరం మొత్తం పూర్తిగా అలసిసొలసి పోయిందని, అనేక గాయాలు అయ్యి.. రక్తం కూడా కారిందని తెలిపింది. ఆమె కష్టానికి కొంతమేర ఫలితం కూడా కనిపిస్తోంది. ఏక్తాకపూర్ నిర్మించి, భూషణ్ పటేల్ దర్శకత్వం వహించిన రాగిణి ఎంఎంఎస్2 చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు బాగానే కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement