సాక్షి, ముంబయి : అనిల్ కపూర్ గారాలపట్టి సోనం కపూర్, ఢిల్లీ కుబేరుడు ఆనంద్ అహుజాల వివాహం మే 8న ముంబయిలో అట్టహాసంగా జరుగుతుందన్న వదంతులపై అనిల్ కపూర్ స్పందించారు. సోనం వివాహానికి సంబంధించి త్వరలోనే మీడియాకు వివరాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సంగీత్, మెహందీ ఎప్పుడు జరుగుతుంది..పెళ్లి వేడుకలు ఎలా ప్లాన్ చేశారనే దానిపైనా సస్పెన్స్ కొనసాగుతున్నాయి. ఈ విషయమై సోనం, ఆనంద్ అహుజాలు నోరుమెదపడం లేదు. అనిల్ కపూర్ ఇల్లును ముస్తాబు చేస్తుండటంతో వివాహ తంతుపై మరింతగా వార్తలు గుప్పుమన్నాయి.
కాగా, తమ కెరీర్ ప్రారంభం నుంచి మీడియా తమకు అండగా నిలుస్తోందని..సరైన సమయంలో అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. తన పెళ్లి వేడుకలపై ఇటీవల సోనం మీడియాతో మాట్లాడుతూ వివాహ వేడుకలకు రూ లక్షలు దుబారా చేయడం తనకిష్టం లేదని ఇంట్లోనే వైభవంగా పెళ్లి చేసుకోవాలనుందని చెప్పిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment