![Its Raining Flowers And Gifts For The Adorable Couple - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/6/sonam-anand-gifts.jpg.webp?itok=LkJ3nsNG)
సోనం కపూర్, ఆనంద్ అహుజా జంటకు బహుమతుల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : మే 8న వివాహ బంధంతో ఒక్కటవుతున్న సోనం కపూర్, ఆనంద్ అహుజాలకు సెలెబ్రిటీ స్నేహితులు, సన్నిహితుల నుంచి పుష్పగుచ్ఛాలు, విలువైన బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి పత్రికపై బహుమతులు వద్దని వినతిని జోడించినా కపూర్ మాన్షన్‌కు గిఫ్ట్‌లు తరలివస్తున్నాయి. సోనంకు సన్నిహితంగా మెరిగే చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఆమెకు కాంచీపురం చీర, అమ్రపాలి జుంకాలు, చెవిరింగులను బహుమతిగా ఇవ్వనున్నారు. మే 8న వివాహ వేడుకతో పాటు అదే రోజు సాయంత్రం సోనం, ఆనంద్ అహుజాల వివాహ రిసెప్షన్ జరగనుంది.
ఇక సోనంకు సన్నిహితంగా మెలిగే సహనటీనటులు సంగీత్‌లో సందడి చేసేందుకు డ్యాన్స్ రిహార్సల్స్‌తో హోరెత్తిస్తున్నారు. గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న సోనం, ఆనంద్‌లు ఎన్నడూ తమ అనుబంధంపై ఎక్కడా నోరుమెదపలేదు. పార్టీలు, ఈవెంట్లకు సైతం ఇద్దరూ కలిసే హాజరైనా వదంతులపై మాత్రం అధికారికంగా స్పందించలేదు. ఇక మే 8న వీరి వివాహం జరుగుతుందని ఇరు కుటుంబాలు అధికారికంగా నిర్ధారించడంతో వివాహ వేడులకపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు సోనం నటించిన వీరే ది వెడ్డింగ్ జూన్ 1న విడుదలకు ముస్తాబవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment