ఎవరీ ఆనంద్‌ అహుజా? | Interesting Details About Anand Ahuja | Sakshi
Sakshi News home page

Published Wed, May 2 2018 1:11 PM | Last Updated on Wed, May 2 2018 1:11 PM

Interesting Details About Anand Ahuja - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ సోనమ్‌ కపూర్‌, వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాల వివాహం ఖాయమైనట్లు ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించేశాయి. దీంతో ఇన్నాళ్లు వచ్చిన రూమర్లకు తెరపడింది. మే 8న ముంబైలో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరుగనున్నాయి. మరీ సోనం పెళ్లిచేసుకోబోతున్న.. ఆనంద్‌ అహుజా ఎవరు అంటే ఆయన ఒక యువ వ్యాపారవేత్త.. భానే బ్రాండెడ్‌ దుస్తుల కంపెనీకి యజమాని. వ్యాపార రంగంలో దిట్ట అయిన హరిష్‌ అహుజాకు ఆనంద్‌ మనుమడు. వీరి పెళ్లికి సంబంధించి ముంబైలో ఒక వేడుకను కపూర్‌ ఫ్యామిలీ నిర్వహించగా... ఢిల్లీలో అహుజా ఫ్యామిలీ మరో వేడుకను నిర్వహించనున్నారు.  ఈ వేడుకలకు కపూర్‌ సపరివారమంతా కలిసి వస్తోంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలను షెడ్యుల్‌ కూడా చేశారని సమాచారం. 

బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ ఫర్హా ఖాన్‌ సంగీత్‌ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. సంగీత్‌లో జాన్వీ కపూర్‌, కరణ్‌ జోహర్‌, రణబీర్‌ కపూర్‌, అర్జున్‌ కపూర్‌లు పాల్గొంటారు. ఆట పాటలతో సంగీత్‌ కార్యక్రమాన్ని అలరించబోతున్నారు. బాలీవుడ్‌ తారాగణం అంతా ఈ పెళ్లికి తరలిరాబోతున్నారు. పెళ్లి శుభలేఖలను ముద్రించకుండా... పేపర్‌ వేస్టేజ్‌ను తగ్గించే పనిలో భాగంగా... ఈ-వెడ్డింగ్‌ కార్డును ఉపయోగిస్తున్నారని బీ టౌన్‌ అంటోంది. సోనమ్‌ తాజా సినిమా ‘వీరే దీ వెడ్డింగ్‌’.. ఈ సినమా ప్రమోషన్‌లో భాగంగా త్వరలోనే జరగబోయే కేన్స్‌ చిత్రోత్సవంలో రెడ్‌కార్పెట్‌పై సోనమ్‌ నడవనున్నారు. ​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement