శ్రీదేవి కుటుంబంలో శుభకార్యం! | Sonam Kapoor To Tie Knock With Boyfriend Anand Ahuja | Sakshi
Sakshi News home page

శ్రీదేవి కుటుంబంలో శుభకార్యం!

Published Sat, Mar 24 2018 12:04 PM | Last Updated on Sat, Mar 24 2018 12:05 PM

Sonam Kapoor To Tie Knock With Boyfriend Anand Ahuja - Sakshi

శ్రీదేవి దంపతులతో సోనం, అనిల్‌ కపూర్‌లు(పాత ఫొటో)

ముంబై: దివంగత మహానటి శ్రీదేవి కుటుంబంలో శుభకార్యం జరుగబోతున్నట్లు సమాచారం. పెద్దకోడలి మరణంతో షాక్‌ గురైన కపూర్‌ ఫ్యామిలీ.. ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నవేళ ఇది శుభవార్తేనని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీదేవి మరిది అనిల్‌ కపూర్‌ కూతురు, ప్రముఖ నటి సోనమ్‌ కపూర్‌ పెళ్లిపీటలెక్కబోతుండటం ఆ వార్త.

32 ఏళ్ల సోనమ్‌.. పారిశ్రామికవేత్త ఆనంద్‌ ఆహుజాలు చాలా కాలంగా లివిన్‌ రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి తేదీ, వేదికలు ఖరారైనట్లు ముంబై మిర్రర్‌ ప్రచురించిన కథనం వైరల్‌ అయింది. మే 11 లేదా 12న జెనీవా వేదికగా ఈ జంట ఒక్కటి కాబోతున్నట్లు, ఈ మేరకు ఇరు కుటుంబాలూ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అతిథులను విదేశానికి తరలించేందుకుగానూ ఇప్పటికే ఫ్లైట్‌ టికెట్స్‌ బుకింగ్‌ కూడా ప్రారంభమైనట్లు తెలిసింది.

2008లో సావరియా సినిమాతో నటిగా పరిచయమైన సోనమ్‌.. 2016లో వచ్చిన నీర్జా సినిమాకుగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ప్యాడ్‌మ్యాన్‌తో మెప్పించిన ఆమె.. ఈ ఏడాది వీరే ది వెడ్డింగ్‌, సంజూ ఏక్‌ లడకీకో దేఖాతో ఐసా లగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

బాయ్‌ఫ్రెండ్‌ ఆనంద్‌తో సోనమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement