‘ముంబై పోలీసులకు ధన్యవాదాలు’ | Anil Kapoor Says Thank You Mumbai Police For Being By Our Side  | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 2 2018 1:41 PM | Last Updated on Fri, Mar 2 2018 3:10 PM

Anil Kapoor Says Thank You Mumbai Police For Being By Our Side  - Sakshi

శ్రీదేవి అంత్యక్రియలు (ఫైల్‌ ఫొటో)

ముంబై : దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొన్న ముంబై పోలీస్‌ సిబ్బందికి  బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, శ్రీదేవి మరిది అనిల్‌ కపూర్‌ ట్వీటర్‌ వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

‘మేం దుఃఖంలోఉన్నప్పుడు మా చుట్టూ చేరి మాకు మద్దతుగా నిలిచిన మిత్రులకు, మా మంచి కోరే శ్రేయోభిలాషులకు తజ్ఞతలు. ముంబై పోలీసులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ విధినిర్వహణతో మాకు కావల్సిన స్పేస్‌, గోప్యత దక్కాయి. మమ్మల్ని అర్థం చేసుకొని ప్రార్ధించిన వారందరికి కృతజ్ఞతలు అని ట్వీట్‌ చేశారు.

ఇక ఈ ట్వీట్‌కు ముంబై పోలీస్‌ శాఖ సైతం స్పందించింది. ‘శోకంలో ఉన్న మీ కుటుంబం మొత్తంతో మేం కలిసున్నాం’  అని ట్వీట్‌ చేసింది.  శ్రీదేవి అంత్యక్రియలు ముంబైలో గత బుధవారం జరిగిన విషయం తెలిసిందే. తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు అభిమానులు పొటెత్తారు. దీంతో అంతిమ యాత్రలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముంబై పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement