
సూర్య ‘24’ టైటిల్ మారనుందా
సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘24’కు చిక్కులు ఏర్పడ్డాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘24’కు చిక్కులు ఏర్పడ్డాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ చిత్రానికి 24 అనే టైటిల్‌ను నిర్ణయించారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ విషయంలో చిక్కులు వచ్చి పడ్డాయి. ఇదే టైటిల్‌తో ఒక హాలీవుడ్ సంస్థ మెగా సీరియల్‌ను రూపొందిస్తోంది. ఆ సీరియల్ ఇండియా ప్రచార హక్కులను బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్ ఏకంగా *150 కోట్లకు పొందారట. ఆ సీరియల్ టైటిల్‌తో సూర్య చిత్రం నిర్మించడాన్ని అనిల్‌కుమార్ వ్యతిరేకిస్తున్నారని సమాచారం. దీంతో సూర్య తన చిత్రం టైటిల్‌ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్.