
అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్
‘‘నా పేరును వాడుకుంటున్నావు.. రాయల్టీ కట్టు లేదా లీగల్ నోటీస్ కోసం సిద్ధంగా ఉండు’’ అని నటుడు–దర్శకుడు అనుపమ్ ఖేర్‌పై హెచ్చరిక జారీ చేశారు అనిల్ కపూర్. విషయం ఏంటంటే.. ‘‘బెల్లెవ్యూ’’ అనే ఓ కెనెడా పాపులర్ టీవీ సిరీస్‌లో ముఖ్య పాత్ర పోషించనున్నారు అనుపమ్ ఖేర్. ఆ సిరీస్‌లో అనుపమ్ క్యారెక్టర్ పేరు డా. అనిల్ కపూర్. ఆ క్యారెక్టర్‌కు తన పేరును వాడుకుంటున్నారు అనే కారణంతో ట్విట్టర్‌లో ఈ కామెంట్స్ చేశారు అనిల్. దాంతో అనిల్, అనుపమ్ మధ్య గొడవ మొదలైందనే వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఈ విషయం పై అనుపమ్ ఖేర్ స్పందిస్తూ – ‘‘అనిల్‌కపూర్ సరదాగా జోక్ చేశాడు. ఈ విషయంపై అనవసరమైన చర్చ జరుగుతోంది.
అయినా అనవసరమైన విషయాల్ని ఫోకస్ చేయడం మనకు అలవాటే కదా. అనిల్ అన్నాడని కాదు కానీ, అతని పేరుతో నేను ఆ క్యారెక్టర్‌ను చేస్తే కొంచెం అయోమయంగా ఉండొచ్చు. అందుకని నా పాత్ర పేరును మార్చమని ప్రొడక్షన్ టీమ్‌ను కోరాను. ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఈ సిరీస్‌లో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంటర్నేషనల్ టెలివిజన్‌లోనే ‘బెల్లవ్యూ’ మోస్ట్ అవెయిటెడ్ సిరీస్. నటుడిగా నా పరిధుల్ని పెంచుకుని, వరల్డ్ క్లాస్ టాలెంట్‌తో పని చేసే అవకాశం కల్పించనుంది ఈ సిరీస్’’ అని పేర్కొన్నారు. డేవిడ్ స్కల్నర్ రాసిన ఈ టీవీ సిరీస్‌ను ఎరిక్ మాన్‌హైమర్ నిర్మిస్తున్నారు. ఒక హాస్పిటల్‌లో పన్నెండు మంది పేషంట్స్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్‌లో అనుపమ్ ఖేర్ మార్చి నుంచి పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment