
బెబో ధరించిన డ్రెస్ విలువ ఎంతంటే!
ఇద్దరు పిల్లల తల్లి అయినా చెక్కు చెదరని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తోంది కరీనా కపూర్. ఒద్దికైన శరీర సౌష్టవం కోసం కఠిన శ్రమకోర్చే బెబో తాజా లుక్ చూస్తే అలాగే అనిపిస్తోంది మరి. రెండో కుమారుడు ‘జే’ జన్మించిన తర్వాత కాస్త విరామం తీసుకున్న కరీనా.. ప్రస్తుతం యాడ్ షూట్లతో బిజీ అయ్యింది. అనిల్ కపూర్‌తో కలిసి ప్రముఖ ఆభరణాల సంస్థకు ఎండార్స్ చేస్తోంది. ఈ క్రమంలో... ఇందుకు సంబంధించిన షూట్‌లో పాల్గొన్న బెబో.. ఫొటోలు, వీడియో షేర్ చేసింది.
ఎంతో అందంగా ఉన్న ఈ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా బెబో అవుట్‌ఫిట్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. సంప్రదాయ అనార్కలీ డ్రెస్ ధరించిన కరీనా కపూర్... అద్భుతమైన జువెల్లరీతో అదరహో అనిపించింది. కాగా ఫ్యాషన్ డిజైనర్ రిధి మెహ్రా రూపొందించిన ఈ జార్జెట్ ఎంబ్రాయిడరీ ఎల్లో కలర్ డ్రెస్ ధర... అక్షరాలా లక్షా నలభై ఎనిమిది వేల రూపాయలట.
ఏంటీ నమ్మబుద్ధి కావడం లేదా.. కావాలంటే.. డిజైనర్ మెహ్రీ వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు. కాగా బెబో ధరించిన ఈ డ్రెస్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘‘అంతగా ఏముంది బెబో ఆ డ్రెస్‌లో.. లక్షన్నర ఖర్చు పెట్టడానికి. ఏదేమైనా ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకున్నావ్. డ్రెస్ భలేగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తను గర్భవతిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను కరీనా కపూర్ ఇటీవలే పుస్తకం రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.