
శ్రీదేవి లాంటి సూపర్ స్టార్‌తో నటించడం నా అదృష్టం. ఆమెని కలిసిన ప్రతిసారి తన కాళ్లకు నమస్కరించేవాడిని అంటున్నారు బాలీవుడ్ మిస్టర్ ఇండియా అనిల్ కపూర్. శ్రీదేవితో కలిసి పలు హిట్ సినిమాల్లో నటించారు అనిల్ కపూర్. ఈ మధ్య ఓ టీవీ కార్యక్రమానికి హాజరైన అనిల్ కపూర్ ఈ సందర్భంగా శ్రీదేవితో తనకు గల అనుబంధం గురించి తెలిపారు. ‘నేను ఆమెని కలిసిన ప్రతి సారి ఆమె పాదాలకు నమస్కరించేవాడిని. ఇది ఆమె పట్ల నాకున్న గౌరవం. కానీ నేను ఇలా చేయడం శ్రీదేవికి చాలా అసౌకర్యంగా అనిపించేది’ అంటూ చెప్పుకొచ్చారు.
‘ఓ ఆర్టిస్ట్‌గా ఆమెలాంటి గొప్ప స్టార్‌తో కలిసి నటించడం నా అదృష్టం. ఆమెతో నటించడం నా కెరియర్‌కి బాగా హెల్స్ అయ్యింది. ఆమెలో చాలా ప్రతిభ ఉంది. స్ర్కీన్ మొత్తాన్ని ఆమె తన మ్యాజిక్‌తో నింపగలదు. ఆమె ప్రతిభకి కొలమానం లేదు. తను మా అన్నని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెపై ఉన్న భక్తి ఏమాత్రం తగ్గలేదు. ఆమె మనతో లేరని బాధపడకూడదు. ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించినందుకు సంతోషించాలి’ అని వెల్లడించారు అనిల్. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయారు శ్రీదేవి.
Comments
Please login to add a commentAdd a comment