ముంబాయి : బాలీవుడ్ నటుడు, నిర్మాత అనిల్ కపూర్ కూతురిగా పుట్టడం తన అదృష్టమని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ వెల్లడించారు. ఆదివారం అనిల్ కపూర్ 61 జన్మదినం. ఈ సందర్భంగా తన తండ్రితో ఆమెకున్నసాన్నిహిత్యాన్ని, అనుభవాలను కొన్ని ఫోటోల ద్వారా ట్వీట్ చేసింది. తన తండ్రి లేకపోతే నేను ఇప్పుడు ఉన్న స్థాయిలో సగానికి కూడా ఎదిగేదాన్ని కానని ట్వీట్ చేసింది. ఈ ప్రపంచంలో తనను బాగా అర్ధం చేసుకున్నవ్యక్తి తన తండ్రేనని చెప్పింది. ఈ సందర్భంగా తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.
ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా అనిల్ కపూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఎప్పుడూ 39 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసున్న వారిగా కనిపిస్తారని అనుపర్ ఖేర్ ట్వీట్ చేశారు. అలాగే సినిమాల్లో మంచి పాత్రలు మీకు రావాలని కోరుకుంటున్నట్లు అనుపమ్ తెలిపారు. 1980, 1990, 2000, 2010 దశకాల్లో అనిల్ కపూర్ ఎప్పుడూ ఒకే విధంగా, యువకుడిగా కనిపిస్తున్నాడని నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశాడు. డ్రామా, యాక్షన్, రొమాన్స్, కామెడీ లాంటి విభిన్నమైన సినిమాల్లో అనిల్ కపూర్ తన నటన ద్వారా జీవించారని, ఆయనలో ఉత్సాహం చూసి కొత్తగా సినీరంగంలోకి వచ్చేవారు కూడా అసూయపడతారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment