‘తను నవ్వింది.. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’ | Anil Kapoor Says He Had Tears In His Eyes Sunita As Bride Wedding Day | Sakshi
Sakshi News home page

‘ఇళ్లు కొనాలి.. ఆ తర్వాతే పెళ్లి అనుకున్నా’

Published Wed, May 20 2020 10:19 AM | Last Updated on Wed, May 20 2020 12:18 PM

Anil Kapoor Says He Had Tears In His Eyes Sunita As Bride Wedding Day - Sakshi

‘‘అన్ని అడ్డంకులు అధిగమించి మే 19న మేం పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నాకింకా గుర్తు. నా వధువు నవ్వుతూ ఉంది. తనను చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి... అవి ఆనంద భాష్పాలు. మా పెళ్లి మాటలు, వివాహ తంతు ఒక్కరోజులోనే పూర్తై పోయింది. అట్టహాసాలు, ఆర్భాటాలు లేవు. హనీమూన్‌కి కూడా వెళ్లలేదు. ఆ విషయం గురించి తను నన్ను ఇప్పటికీ ఆటపట్టిస్తూనే ఉంటుంది. తను నా జీవితంలోకి రావడం అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన విషయం’’ అంటూ బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ తన పెళ్లినాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు. 36వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్య సునీత కపూర్‌, తాను కలిసి ఉన్న ఫొటోలు షేర్‌ చేసి ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. (మీరందరూ సూపర్‌ హీరోలే)

కపూర్‌ ఖాన్‌దాన్‌కు చెందిన అనిల్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌గా పేరొందిన సునీత 1984లో మేరీ జంగ్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి.. వారి అంగీకారంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మంగళవారం తమ పెళ్లి రోజు సందర్భంగా సునీతకు తన ప్రేమను వెల్లడించిన నాటి జ్ఞాపకాలను అనిల్‌ కపూర్‌ గుర్తు చేసుకున్నారు.(మా కుటుంబంలోకి స్వాగతం రానా: సోనం కపూర్‌)

‘‘నా గర్ల్‌ఫ్రెండ్‌ సునీత దగ్గరకు వెళ్లి.. భార్యగా నా జీవితంలో అడుగుపెడతావా అని అడిగాను.. మా పెళ్లి ఆలస్యంగా జరిగింది. తను నాతో ఉంటే ఎంత సంతోషంగా ఉండగలదు. తన కోసం నేనేం చేయగలను. తన కన్న కలలను కొంతమేర అయినా నిజం చేయగలనా అని నిరూపించేందుకు ఆ సమయాన్ని వినియోగించుకున్నాను. కనీసం ఒక ఇల్లు కొని, పనిమనిషిని పెట్టకోగలననే నమ్మకం వచ్చిన తర్వాత తనను పెళ్లిచేసుకోవాలనుకున్నాను. ఆ మాత్రం పొందేందుకు తను అర్హురాలే కదా. ఇంకోవిషయం కెరీర్‌ తొలినాళ్లలోనే పెళ్లి ఎందుకు అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. అయితే సునీత సాంగత్యం లేకుండా ఒక్కరోజు కూడా గడపలేనన్న విషయం నాకు మాత్రమే తెలుసు. ప్రేమా, కెరీరా అనే ప్రశ్నలు మాలో తలెత్తలేదు. మా దృష్టిలో ఆ రెండూ ముఖ్యమే. సమాంతరంగా సాగాల్సిన విషయాలే. ఎల్లప్పుడూ మా మధ్య అవగాహన, ప్రేమ ఇలాగే ఉంటుంది. నా ప్రేమ, జీవితం సునీతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అని అనిల్‌ కపూర్‌ తన ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్టు షేర్‌ చేశారు.

కాగా అనిల్‌ కపూర్‌- సునీత జంటకు కూతుళ్ళు సోనం కపూర్‌, రియా కపూర్‌.. కుమారుడు హర్షవర్ధన్‌ కపూర్‌ ఉన్న సంగతి తెలిసిందే. వీరు ముగ్గురు సినిమా రంగానికే చెందిన వారు కావడం విశేషం.

How 19th May became the best day of our lives!⁣ ⁣ I proposed to my girlfriend Sunita and asked her to be my wife... our wedding had been delayed a lot because I wanted to be sure that I could take care of her in the way she deserved and give her everything she could ever dream of...in the very least, I needed to be able to afford to buy a house and hire a cook!! I just wanted to be worthy of her...⁣ We got married on 19th May, against all odds....I still remember when I entered her house on our wedding day and saw my bride, she was smiling and I had tears in my eyes... Tears of happiness, but also nervousness... I mean it was my wedding day! Our wedding was planned and executed within a day, and yes we may not have had a big wedding or even a honeymoon, which she still teases me about, but it was still the best thing that ever happened to me....it was now or never for us and I’m so glad we took the leap that day and started our lives together... many people prophesied that marrying so early would be disastrous for my career, but all I knew was that I did not want to waste another day without her and wanted her by my side through it all... for us it was never career or love.. it was always love AND career...⁣ I won’t say in the end we lived happily ever after...because it is not even close to the end of our love story... we still have a lot of love to share together, forever.... ⁣ ⁣ Happy Anniversary to the love of my life, my wife Sunita... @kapoor.sunita

A post shared by anilskapoor (@anilskapoor) on

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement