
సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ విష్టోయ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసింది. ఇటీవల కృష్ణజింక కేసులో జోద్‌పూర్ కోర్టుకు హాజరైన సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే తాజాగా కొందరు వ్యక్తుల సల్మాన్ ఖాన్పై దాడికి యత్నించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ రేస్ 3 షూటింగ్ లోబిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో చిత్రయూనిట్ అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు సల్మాన్ తో పాటు చిత్ర నిర్మాత రమేష్ తౌరానిని ఎస్కార్ట్ వాహనంలో ఇంటికి తరలించారు. ఇక మీద షూటింగ్ సమయంలో సల్మాన్ కు సెక్యూరిటీ మరింత పెంచే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారట. సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తున్న రేస్ 3 సినిమాలో అనీల్ కపూర్, డైసీ షా, బాబీ డియోల్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ఈ చిత్రానికి దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment