రోడ్డుపై కూలిన విమానం ఏడుగురు మృతి
లండన్: ఇంగ్లాండ్‌లోని బ్రిగ్టన్ సిటీ సమీపంలో వైమానిక విన్యాసాల్లో పాల్గొన్న ఓ యుద్ధ విమానం కూప్పకూలడంతో ఏడుగురు చనిపోయారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, దాదాపు 14 మంది గాయాలపాలయ్యారని శనివారం పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఇంగ్లాండ్‌లోని బ్రిగ్టన్ దగ్గర్లో శనివారం మధ్యాహ్నం సమయంలో ‘షోరెహామ్ ఎయిర్ షో’లో 1950లనాటి హ్యాకర్ హంటర్ యుద్ధవిమానం వృత్తాకారంలో వైమానిక విన్యాసం ప్రదర్శిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది.
దీంతో ఎయిర్‌పోర్టు సమీపంలో రద్దీగా ఉన్న రహదారిపై కుప్పకూలింది. విమానం నిట్టనిలువుగా పడడంతో ఏడుగురు అక్కడిక్కడే మరణించారని వెస్ట్ ససెక్స్ విభాగం పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పిం చారు. రోడ్డుపై విమానం కూలడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి.