
సాక్షి, మెదక్: పెళ్లి విందులో తలెత్తిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. నర్సాపూర్ మండల పరిధిలోని చండి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ మండల పరిధిలోని చండి గ్రామానికి చెందిన అమ్మాయిని అదేమండలం నత్నయిపల్లికి చెందిన అబ్బాయితో శనివారం చండి గ్రామంలో పెళ్లి జరిగింది.
పెళ్లి అనంతరం భోజనం వడ్డిస్తున్న క్రమంలో అబ్బాయి తరఫు వ్యక్తికి మటన్ ముక్కలు వేయకుండా సాంబార్ పోశాడని గొడవకు దిగారు. మటన్ వడ్డిస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిపై అబ్బాయి తరఫు వారు దాడి చేయగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి నలుగురిపై కేసు నమోదు చేశారు.
చదవండి: ఖమ్మం మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు!