విజయ్‌ దేవరకొండకి ఫాదర్‌గా బాలీవుడ్‌ నటుడు? | Sunil Shetty May Act As In Fighter Telugu Movie | Sakshi
Sakshi News home page

విజయ్‌ దేవరకొండకి ఫాదర్‌గా?

Published Wed, Oct 21 2020 8:24 AM | Last Updated on Wed, Oct 21 2020 1:21 PM

Sunil Shetty May Act As In Fighter Telugu Movie - Sakshi

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఫైటర్‌’. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. తండ్రి పాత్రను  బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి చేయనున్నారని సమాచారం. సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల్లో సునీల్‌ శెట్టి పాత్ర కనిపిస్తుందట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మళ్లీ ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement