
హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ భామ అనన్య పాండేలు జంటగా నటిస్తున్న సినిమా ‘ఫైటర్’. ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల వీరిద్దరూ ముంబై వీధుల్లో బైక్‌పై చక్కర్లు కొడుతూ రైడ్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌కి సంబంధించిన మరో వీడియో సోషల్ వీడియాలో వైరల్ అవుతోంది. ఇక విజయ్ షూటింగ్ స్పాట్‌కు కొంత మందితో నడుచుకుంటూ వస్తుండగా ఆకస్మాత్తుగా కాలు జారి పడిపోబోయాడు. దాదాపు కింద పడిపోతున్న సమయంలో తన చుట్టూ ఉన్న వారు విజయ్‌ను పట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
నా క్యారెక్టర్ నాలానే ఉంటుంది!
ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘కాస్త చూసుకోండి అర్జున్‌రెడ్డి సార్.. ప్రీతి బాగానే ఉంది కదా. మీకేమైనా అయితే తను ఏం అయిపోతుంది!’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక ఈ ‘ఫైటర్’ భామ అనన్యను ఉద్దేశించి... ‘అరె.. అనన్య నీ తాజా జోడి(అనకొండ) పడిపోబోయాడు.. తనని జాగ్రతగా చూసుకోవాలి కదా’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా టాలీవుడ్ కమర్షియల్ దర్శకుడు పూరీ జగన్నాద్ రూపొందిస్తున్న ఈ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీనులు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సెట్స్‌పైకి వచ్చిన ‘ఫైటర్’ను ఏకకాలంలో తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment