బై బై ముంబై | Fighter movie shooting completed in mumbai | Sakshi
Sakshi News home page

బై బై ముంబై

Published Mon, Mar 9 2020 12:25 AM | Last Updated on Mon, Mar 9 2020 12:25 AM

Fighter movie shooting completed in mumbai - Sakshi

విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్, చార్మీ

గత నలభై రోజులుగా ముంబై వీధుల్లో విహరిస్తున్నారు విజయ్‌ దేవరకొండ.. రేసింగ్‌ చేస్తున్నారు.. ఫైటింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఓ చిన్న బ్రేక్‌ ఇచ్చారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. చార్మీ, పూరి, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనన్యా పాండే  హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 40 రోజుల ముంబై షెడ్యూల్‌ను మొన్న పూర్తి చేశారు. చిన్న బ్రేక్‌ తర్వాత కొత్త షెడ్యూల్‌ను ప్రారంభిస్తారు. ఈ సినిమాలో విజయ్‌ లుక్‌ చాలా కొత్తగా ఉంటుందని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement