రొమాంటిక్‌ రైడ్‌ | Ananya Panday Goes For A Bike Ride With Vijay Deverakonda | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ రైడ్‌

Published Mon, Mar 2 2020 5:29 AM | Last Updated on Mon, Mar 2 2020 5:29 AM

Ananya Panday Goes For A Bike Ride With Vijay Deverakonda - Sakshi

విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే

ముంబై వీధుల్లో బైక్‌పై రొమాంటిక్‌ రైడ్‌ను ఆస్వాదిస్తున్నారు విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే. ఇదంతా పూరి జగన్నాథ్‌ రూపొందిస్తున్న ‘ఫైటర్‌’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా కోసం. ఛార్మి, పూరి, కరణ్‌ జొహర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబై నగరంలో జరుగుతోంది. బైక్‌ రేసింగ్‌కి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బైక్‌పై అనన్యా పాండేతో రేస్‌లో పాల్గొన్నారు విజయ్‌. మరి రేస్‌ గెలిచారా? వేచి చూడాలి. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement