
: ప్రభాకర్‌రావు(ఫైల్)
మధిర రూరల్ : స్వాతంత్య్ర సమరయోధుడు, మధిర మున్సిపల్ మాజీ చైర్మన్ మందడపు ప్రభాకర్‌రావు(97) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతిచెందారు. 1964లో మధిర మున్సిపాల్టీకి చివరి చైర్మన్‌గా పనిచేశారు. డీసీఎంఎస్ చైర్మన్‌గా, మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డికి ముఖ్య సహచరుడిగా పనిచేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని మధిర మాజీ సర్పంచ్ వాసంశెట్టి లక్ష్మీప్రియ తెలిపారు. గురువారం పలువురు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా, ప్రభాకర్‌రావుకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.