సివంగిలా దూకి....దొంగకు చుక్కలే! | A girl heroic fight against a thief who picks up the phone | Sakshi
Sakshi News home page

సివంగిలా దూకి....దొంగకు చుక్కలే!

Published Tue, Sep 1 2020 8:04 PM | Last Updated on Tue, Sep 1 2020 9:06 PM

 A girl heroic fight against a thief who picks up the phone - Sakshi

సాక్షి, జలంధర్: తన చేతిలోని ఫోన్ లాక్కుని పారిపోతున్న దుండగులకు ఒక బాలిక (15) చుక్కలు చూపించింది. ఏ మాత్రం పట్టువిడవకుండా.. సివంగిలాగా దూకి వాడి ఆటకట్టించింది. సీసీటీవీలో ఈ రికార్డైన ఈ దృశ్యాలు  ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంజాబ్ లోని జలంధర్ నగరంలో ఈ ఘటన జరిగింది. 

ఓ వీధిలోంచి నడుచుకుంటూ వెళుతున్న అమ్మాయి నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు  దుండగులు ఫోన్ లాక్కున్నారు.  అనంతరం సిద్ధంగా ఉన్న బైక్ పై పారిపోయే ప్రయత్నంలో ఉండగానే, మెరుపు వేగంగా కదిలింది ఆ అమ్మాయి. వెనుక కూర్చున్న ఒక దొంగను దొరక బుచ్చుకుంది.  అతగాడు బైక్‌ దిగి ఆ అమ్మాయిని కొడుతున్నా ఏ మాత్రం వెరవలేదు..పట్టువిడవలేదు. అలానే అతని కాలర్‌ పట్టుకుంది. చేతికి దొరికిన ఆ దొంగను పారిపోనివ్వకుండా నిలువరించింది. ఈ లోపు స్థానికులు రావడంతో  బైక్ పై ఉన్న మరో దొంగ మాత్రం పారిపోగా, దొరిగిన దొంగకు బడిత పూజ చేశారు. దీంతో ఆ అమ్మాయి తెగువ, ధైర్యంపై అభినందనలు కురుస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement