
39 వర్థంతి సందర్భంగా స్మరించుకున్న ముంబై తెలుగు రజక సంఘాలు
సాక్షి, ముంబై: నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న రజక బాంధవులు వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్రను గురించి స్మరించుకున్నారు.
బోరీవలిలో....
గొరాయి రజక మిత్రమండల్ అధ్వర్యంలో మంగళవారం సాయంత్రం వీరనారి చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. దొరలకు ఎదురొడ్డి నిలిచిన చాకలి ఐలమ్మకు జోహార్లు చెబుతూ.... కొవ్వొత్తులు వెలిగించి పురవీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు. ఐఈసందర్భంగా మండల్ కోశాధికారి చింతకింది మల్లేష్ మాట్లాడుతూ.... కోఠిలోని మహిళా యునివర్సిటికీ చాకలి ఐలమ్మ పేరిట నామకరణం చేయడం అభినందనీయమని, ఐలమ్మ ధైర్య, సాహసాలు ప్రతి మహిళకు ఆదర్శమని పేర్కొన్నారు. దీంతో బావితరాలకు ఐలమ్మ పేరు చిరస్మరణీయంగా మిగిలి పోతుందని హర్షం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ అధ్యక్షురాలియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు ముత్యాల బాల నరసయ్య, సెక్రటరీ బాగోలా అంజయ్య,కోశాధికారి చింతకింది మల్లేశ్, సంఘం సభ్యులు ముత్యాల భూ లచ్చయ్య, ముత్యాల స్వామి, యాదగిరి నిమ్మరాజు, మహిళలు నిమ్మరాజు భాగ్యలక్ష్మి, ముత్యాల వసంత, కిచిగారి కళావతి, చింతకింది కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు
అంటాప్‌హిల్‌లో...
ముంబై, అంటాప్ హిల్‌లోని తెలుగు రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఆమె చేసిన త్యాగాలు, సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నదిగోటి వెంకటేష్, ఉపాధ్యక్షుడు మరిపెళ్లి మల్లేష్ కోశాధికారి భూమ చిన్న నర్సింహ, ఉప కోశాధికారి భూమా యాదయ్య, కార్యవర్గ సభ్యులు అక్కనపెల్లి నరసింహ, తాందారి వెంకన్న, బొమ్మపాలెం వెంకటేష్‌బాసవాడ కృష్ణ, అయితే రాజు మల్లేష్, పొన్న సోమయ్య, రెడ్డిపల్లి ఎల్లయ్య, భూమా వెంకటేష్, రెడ్డిపల్లి లింగయ్య, చర్లపల్లి వెంకటే‹Ù, వడ్డెబోయిన నాగరాజు, మనపెద్ది శ్రీనివాస్, భూమా అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

కాందివలిలో...
పశ్చిమ కాందివలి చార్కోప్‌లోని బుద్దవిహార్‌లో ముంబై రజక ఫౌండేషన్ అధ్వర్యంలో ఐలమ్మ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ఈ కార్యక్రమంలో రజక ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చింతల మహేందర్, ముత్యాల సంతోష్, మదనాల సత్తన్న, మదనాల నర్సింహులు, అక్కోల శ్రీనివాస్, గోలి శంకర్, స్వామి నల్లూరి, పోగుల రాజేశ్, గాయకులు దుబ్బాక నరేష్ లక్ష్మణ్ ఎనగందుల మమత, దవనపల్లి సుమ, కూన స్వరూప, శోభ, పద్మ, పూజ, లలిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment