
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో విజయ్ దేవరకొండ జూబ్లీహిల్స్‌లోని 360 డిగ్రీ ఫిట్నెస్ కార్యక్రమంలో 30 రోజుల్లో బరువు తగ్గే చాలెంజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలుగా జిమ్‌కు వస్తున్నట్లు చెప్పారు. మరో ప్రాజెక్ట్ ఫైటర్ సినిమా కోసం బెస్ట్ బాడీ షేప్‌ని తయారు చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మంచి డైట్ ప్లాన్‌తో ఫిట్‌నెస్‌పై జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫిట్‌నెస్ ట్రైనర్ కులదీప్ సేతి, 360 డిగ్రీ ఫిట్నెస్ ఎండీ సునితారెడ్డి పాల్గొన్నారు.