US: Elderly Man Beaten Up After Chaotic Fight Over Seat In AMC Movie Theater, Video Viral - Sakshi
Sakshi News home page

థియేటర్‌లో సీటు కోసం గొడవ.. వృద్ధునిపై యువకుని పిడిగుద్దులు.. వీడియో వైరల్‌..

Published Fri, Jul 21 2023 6:59 PM | Last Updated on Fri, Jul 21 2023 7:41 PM

US Old Man Beaten Up In Fight Over Seat In Movie Theatre - Sakshi

అమెరికాలో దారుణం జరిగింది. సినిమా హాల్‌లో సీటు కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడ్ని చితకబాదాడో యువకుడు. 63 ఏళ్ల వృద్ధినిపై పిడిగుద్దులు కురిపించాడు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర‍్యలు చేపట్టారు. ఫ్లోరిడాలోని పొంపానో బీజ్‌ ఏఎంసీ సినిమా థియేటర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

బీచ్‌ పక్కనే ఉన్న ఫస్ట్ క్లాస్ థియేటర్‌లో సినిమా ఆరంభమైంది. అందరూ తమ తమ సీట్లలో కూర్చుంటున్నారు. ఇంతలో వీఐపీ టికెట్టు కొనుగోలు చేసిన ఓ వృద్ధ జంట తమ సీట‍్ల వద్దకు వచ్చారు. కానీ అప్పటికే అందులో ఇద్దరు యువ జంట కూర్చున్నారు. దీంతో మరో సీటులో కూర్చోవలసిందిగా అభ్యర్థించాడు ఆ వృద్ధుడు.

ఈ చిన్న విషయానికి తీవ్ర కోపోద్రిక్తుడైన యువకుడు వృద్ధునిపై దాడికి పాల్పడ్డాడు. కిందపడిన వృద్ధునిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. పక్కనే ఉన్న కొందరు అతన్ని అడ్డగించారు. దీంతో వివాదం అప్పటికి సద్ధుమణిగింది. కానీ ఈ ఘటనలో వృద్ధుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట‍్టారు.

ఇదీ చదవండి: పొగలుకక్కే ఫుడ్‌ పెట్టినందుకు..మెక్‌డొనాల్డ్స్‌ రూ. 6 కోట్లు చెల్లించింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement