old mans
-
థియేటర్లో సీటు కోసం గొడవ.. వృద్ధునిపై యువకుని పిడిగుద్దులు..
అమెరికాలో దారుణం జరిగింది. సినిమా హాల్లో సీటు కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడ్ని చితకబాదాడో యువకుడు. 63 ఏళ్ల వృద్ధినిపై పిడిగుద్దులు కురిపించాడు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫ్లోరిడాలోని పొంపానో బీజ్ ఏఎంసీ సినిమా థియేటర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బీచ్ పక్కనే ఉన్న ఫస్ట్ క్లాస్ థియేటర్లో సినిమా ఆరంభమైంది. అందరూ తమ తమ సీట్లలో కూర్చుంటున్నారు. ఇంతలో వీఐపీ టికెట్టు కొనుగోలు చేసిన ఓ వృద్ధ జంట తమ సీట్ల వద్దకు వచ్చారు. కానీ అప్పటికే అందులో ఇద్దరు యువ జంట కూర్చున్నారు. దీంతో మరో సీటులో కూర్చోవలసిందిగా అభ్యర్థించాడు ఆ వృద్ధుడు. Cops in Florida looking for a man who beat up a 63-year-old man because he asked to switch seats in a Pompano Beach AMC movie theater.#TrueCrime pic.twitter.com/jBvs5IDCat — Joseph Morris (@JosephMorrisYT) July 20, 2023 ఈ చిన్న విషయానికి తీవ్ర కోపోద్రిక్తుడైన యువకుడు వృద్ధునిపై దాడికి పాల్పడ్డాడు. కిందపడిన వృద్ధునిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. పక్కనే ఉన్న కొందరు అతన్ని అడ్డగించారు. దీంతో వివాదం అప్పటికి సద్ధుమణిగింది. కానీ ఈ ఘటనలో వృద్ధుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: పొగలుకక్కే ఫుడ్ పెట్టినందుకు..మెక్‌డొనాల్డ్స్ రూ. 6 కోట్లు చెల్లించింది! -
‘ఆసరా’ ఇవ్వరా?
వనపర్తి: పింఛన్‌పైనే ఆధారపడిన పేదలు చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారు.. ఊర్లో అప్పు పుట్టక.. మందులు కొనుక్కోవడానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేక పింఛన్ ఎప్పుడు వస్తుంది దేవుడా.. అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. రోజు కార్యాలయానికి వెళ్లడం ఏమైంది సారూ.. అని అడగడం.. ఏమో అని అధికారి చెప్పే సమాధానం విని నిరాశతో తిరిగిరావడం నిత్యకృత్యమైంది. పక్షం రోజులుగా పరేషాన్ ప్రతినెలా బ్యాంకు ఖాతాలో జమయ్యే ఆసరా పింఛన్ మే మాసం పూర్తయి పక్షం రోజులవుతున్నా రాకపోవటంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్‌పై ఆధారపడే వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. జూన్ మాసం నుంచి పింఛన్ పెరుగుతుందని ఆశ పడిన పేదలకు మే నెల పింఛన్ కూడా రాకపోవటంతో బ్యాంకుల వద్దకు వచ్చి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా అని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతీనెలా పింఛన్ వస్తుందనే ధైర్యంతో కిరాణం, టీకొట్టు, మెడికల్ షాపుల్లో అరుపు పెట్టే అలవాటు ఉన్న వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మే నెల పింఛన్లు ఎందుకు రాలేదన్న ప్రశ్నలకు ఇటు అధికారులు, అటు పాలకులు సరైన సమాధానం చెప్పకపోవటంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో 71,589 మంది జిల్లాలో మొత్తం ఆసరా లబ్ధిదారులు 71,589 మంది ఉండగా వృద్ధులు 28,020, వితంతువులు 27,546, చేనేత కార్మికులు 696, గీత కార్మికులు 456, బీడీ కార్మికులు 1003 మంది ఉన్నారు. వారికి ప్రతినెల రూ. వెయ్యి, 11,277 మంది వికలాంగులకు ప్రతి నెల రూ.1500ల చొప్పున జిల్లాలో ప్రతి నెల ఆసరా పింఛన్ల రూపేన ప్రభుత్వం రూ. 8.19 కోట్లు కెటాయిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,591 మంది ఒంటరి మహిళలకు ప్రతినెల రూ. వెయ్యి చొప్పున నెలకు రూ.26 లక్షలు ఇస్తోంది. రెట్టింపైనట్టేనా? ప్రస్తుతం ఆసరా పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులకు ఎన్నికల హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం 2019 జూన్ మాసం నుంచి రూ.వెయ్యి పింఛన్ తీసుకునే వారికి రూ.2016, రూ.1500 పింఛన్ అందుకునే వికలాంగులకు రూ.3016 ఇస్తామని ప్రకటించింది. కానీ ఒకనెల ముందే అసలుకే పింఛన్ ఇవ్వకపోవటంతో వృద్ధులు, వికలాంగులు ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్లి అధికారులను నిలదీసేందుకు వెనకాడటం లేదు. అమరచింత నిరసన గురువారం జిల్లాలోని అమరచింత మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆసరా పింఛన్ల లబ్ధిదారులు మే, జూన్ మాసం పింఛన్లు వెంటనే ఇప్పించాలని నిరసన వ్యక్తం చేశారు. వారికి కమ్యూనిస్టు పార్టీలతో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపారు. పింఛన్లు పెంచుతామని చెప్పి మొత్తానికి ఇవ్వకుండా ఆపేస్తే వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారని నినదించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెంచిన ప్రకారం ఆసరా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఆసరా ఆలస్యం!
వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఆసరా పింఛన్లు ఆలస్యమవుతున్నాయి. నెలాఖరు కావొస్తున్నా ఇప్పటి వరకు వారి చేతికి డబ్బులు అందలేదు. దీంతో పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు. పింఛన్ ఎప్పుడొస్తుందా అని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. * ప్రతినెలా ఇదే తంతు * నేటికీ అందని పింఛన్ * 5.41 లక్షల మంది ఎదురుచూపు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పింఛన్ మొత్తాన్ని పెంచిన విషయం తెలిసిందే. గతంలో వృద్ధులు, వితంతవులకు రూ.200, వికలాంగులకు రూ.500 చొప్పున పింఛన్ ఇచ్చేవారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వృద్ధులు, వితంతవులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున చెల్లిస్తున్నారు. వీరితోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకూ రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తోంది. అయితే గతంలో పింఛన్లు ప్రతినెలా ఒకటో తారీఖునే వచ్చేవి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రతినెలా ఒకటో తారీఖున పింఛన్ డబ్బు తీసుకునేవారు. కానీ గత కొద్దినెలలుగా పరిస్థితి భిన్నంగా మారింది. ప్రతినెలా రూ.వెయ్యి పింఛన్ వస్తుందనే సంతోషం వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల్లో కనిపిస్తున్నా... ఆ సొమ్ము ఏ రోజు ఇస్తారో తెలియక సతమతమవుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి నెలాఖరు దాకా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పింఛన్ కోసం వాకబు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 5.44 లక్షల మంది జిల్లావ్యాప్తంగా ప్రతినెలా 5,44,215 మందికి పింఛన్లు మంజూరవుతున్నాయి. వాటిలో 1,92,563 మంది వృద్ధులు, 1,31,226 మంది వితంతవులు, 67,804 మంది వికలాంగులు, 9074 మంది చేనేత కార్మికులు, 11,615 మంది గీత కార్మికులు, 1,29,681 మంది బీడీ కార్మికులు, 3,220 మంది హెచ్ఐవీ బాధితులున్నారు. వీరికి ప్రతినెలా రూ.59.09 కోట్లు చెల్లిస్తోంది. వీరుగాక అభయహస్తం కింద 19,823 మంది మహిళలకు ప్రతినెలా రూ.4.08 కోట్లు చెల్లిస్తోంది. ఆయా మొత్తాన్ని ప్రభుత్వం గ్రామాల్లో ఎంపీడీవోలకు పంపుతోంది. ప్రతినెలా 15 వరకు ఆ మొత్తాన్ని ఎంపీడీవోలకు జమ చేస్తుండగా, అక్కడి నుంచి గ్రామ కార్యదర్శులకు వారి ద్వారా పింఛన్ దారులకు నెలాఖరులోపు చెల్లిస్తున్నారు. సుమారు 3,66,280 మంది పింఛన్‌దారులు గ్రామ కార్యాదర్శుల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్ము తీసుకుంటున్నారు. మిగిలిన వారి విషయానికొస్తే... జిల్లాలో 182 గ్రామ పంచాయతీల్లో వీఎల్ఈ/సీబీఎస్ల ద్వారా నేరుగా 82,422 మంది పింఛన్‌దారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. పట్టణాల విషయానికొస్తే.. జిల్లాలోని 93,261 మంది పింఛన్‌దారులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే పింఛన్ సొమ్ము జమ అవుతోంది. అయితే పింఛన్ సొమ్ము మాత్రం ఏ రోజు జమ అవుతుందో తెలియక వృద్ధులు, వితంతవులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్ సొమ్ము అందనేలేదు. అధికారులను అడిగితే ఎప్పుడు వస్తుందో కూడా చెప్పడం లేదని పలువురు వాపోతున్నారు. ఇదే విషయంపై అధికారులను వాకబు చేయగా ప్రభుత్వం నుంచి బుధవారమే డబ్బులు బ్యాంకుల్లో జమ అయ్యాయని, నెలాఖరులోపు పింఛన్ అందజేస్తారని పేర్కొనడం గమనార్హం. ఆఫీస్ చుట్టూ తిరుగుడే పింఛన్‌కోసం రోజు గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. ఎప్పుడు పైసలిత్తరో తెలుస్తలేదు. పైసలస్తే సమ్మక్కజాతరకు పోదామనుకున్నా... పైసల కోసం పట్టించుకునేటోల్లే లేరు. - అగ్గి భూదేవి వృద్ధురాలు -
పింఛనుంటేనే.. ప్రాణం నిలిచేది...
వైఎస్సార్ బువ్వ పెడితే లాగేస్తారా? గత ప్రభుత్వానికి పింఛనుదారుల సూటి ప్రశ్న గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : వయసుడిగిపోయిన వృద్ధులు, దిక్కుమొక్కులేని వితంతువులు, సొంతకాళ్లపై నిలబడలేని వికలాంగులు, రెక్కాడితేగానీ డొక్కాడని నేతకార్మికులను ఆదుకునే నాధుడే కరువయ్యాడని వాపోతున్నారు. నెలానెలా అందాల్సిన పింఛన్ ఎంతకాలమైనా అందకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఒక పింఛనుదారుడు చనిపోతే గానీ వేరేవారికి పింఛన్ ఇవ్వలేమన్న చంద్రబాబు పాలన రోజులు మళ్లీ గుర్తుకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు కేవలం రూ.75 పింఛన్ ఇచ్చేవారని... అదీ నెలనెలా కాకుండా జన్మభూమి జరిగినపుడు జనం తగ్గకుండా ఉండేందుకు వృద్ధుల్ని ఆరు నెలలకు ఒకసారి సభలకు పిలిపించి, అక్కడ ఇస్తామంటూ అగచాట్లకు గురిచేసేవారని గుర్తుచేసుకుంటున్నారు. మళ్లీ అలాంటి దుర్ధినం రాకూడదని ఆ దేవున్ని వేడుకుంటున్నామని పింఛన్‌దారులు కన్నీళ్లపర్యంతమవుతున్నారు. మానవతావాది, దివంగత మహానేత వైఎస్ హయాంలో.... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విస్తర వేసి భోజనం పెడితే..సీల్డుకవర్ పాలకులు వచ్చి తమ నోటి దగ్గరున్న బువ్వను లాగేశారని పింఛనుదారులు అంటున్నారు. చంద్రబాబు హయాంలో కేవలం రూ.75 ఉండే వృద్ధాప్య పింఛన్‌ను పేద వర్గాల్ని దృష్టిలో పెట్టుకుని మానవతావాదంతో వైఎస్ రూ.200కు పెంచారు. అప్పటి వరకు పెద్దపెద్ద సిఫారసులు ఉన్న వారికే ఇచ్చే అరకొర ఫించన్ల సంఖ్యను అర్హులైన వారందరికీ వర్తింజేశారు. 1,44,219 వృద్ధులు, 5,550 నేత కార్మికులు, 30,320వికలాంగులకు, 80,130వితంతువులు వైఎస్సార్‌హయాంలో పింఛన్లు పొందినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్లుగా పింఛన్లను లబ్ధిదారులకు అందే విధంగా వినూత్న పాలనను అందించారాయన. ఏ వృద్ధులయినా అనారోగ్య రీత్యా రాలేకపోయినా... కనీసం 5వ తేదీ లోగా ఇంటి ముంగిటకు పింఛన్లను పంపించే విధంగా ఉద్యోగుల్ని ఆదేశించి వర్తింపజేసిన ఘనత మహానేతకే దక్కుతుంది. చేతకాని కిరణ్ సర్కార్... పింఛన్లను అందజేసేందుకు కిరణ్ సర్కార్ అడ్డమైన సాకులు చెబుతూ పింఛనుదారుల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. జిల్లాలో ఇప్పటికి సుమారు 3.22లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. కాని వారిలో దాదాపు 30వేల మందిని వివిధ కారణాలు చూపి తొలగించారు. స్మార్ట్‌కార్డులు, ఆధార్ కార్డులు లేవని, ఫింగర్ ప్రింట్స్ పడలేదన్న సాకులతో పింఛనుదారుల్ని ప్రభుత్వ జాబితా నుంచి తొలగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రెండు నెలల నుంచి కొంతమందికి పింఛన్లు ఇవ్వటం లేదు. మరి కొంతమందికి నెల నుంచి ఎగనామం పెట్టేశారు. గ్రామ పంచాయతీల మెట్లపై పింఛనుదారులు వెయ్యి కళ్లతో అమాయకంగా ఎదురు చూస్తున్న దృశ్యాలు నిత్యం గోచరిస్తున్నాయి. ఆ నాలుగు డబ్బులూ కాస్త మందులకు ఉపయుక్తమవుతాయన్న వారి దయనీయ స్థితి అందర్నీ కంటిచెమ్మ పెట్టిస్తోంది. వైఎస్సే పింఛను పెంచాడు... ఆ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి నా పింఛన్‌ను పెంచి, నాకు పెద కొడుకయ్యారు. చంద్రబాబు పాలనలో రూ.75 తీసుకునేవాడిని. దానిని రూ.200కు పెంచిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. ఆ విధంగా మాకు న్యాయం చేయాలంటే ఆయన తనయుడు జగన్‌కు మాత్రమే సాధ్యమవుతుంది. వెనుకా ముందూ ఎవరూ లేరు. ఇప్పుడు మా పింఛన్లే తీసేశారు. ఎవరికి చెప్పుకోవాలి. - కాగిత రాఘవయ్య, శేరీ దగ్గుమిల్లి(గుడ్లవల్లేరు మండలం) మహానేతే మంజూరు చేశాడు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి నా పింఛన్‌ను ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేశాడు. రెండు నెలలుగా పింఛను ఇవ్వబోమని పొమ్మంటున్నారు. రోజూ వచ్చి పంచాయతీ మెట్ల వద్ద కూర్చున్నా ఎవరూ మా ముఖం చూడటం లేదు. మందులు, తిండికి డబ్బులు లేక ఏడుపు వస్తుంది. పింఛను డబ్బులు వాటికి వాడుకునేదానిని. జగన్ ఒక్కడే మా కష్టం తీరుస్తాడనే నమ్మకం ఉంది. - బొల్లా రఘుపతమ్మ, శేరీ దగ్గుమిల్లి(గుడ్లవల్లేరు మండలం)