శ్రీకాంత్... పోరాట యోధుడు | Srikanth is a fighter, says Pullela Gopichand | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్... పోరాట యోధుడు

Published Tue, Mar 31 2015 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

శ్రీకాంత్... పోరాట యోధుడు

శ్రీకాంత్... పోరాట యోధుడు

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ముఖచిత్రంపై భారత స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ అద్భుత విజయాలతో తనదైన ముద్ర వేస్తున్నాడు. గతేడాది లిన్ డాన్‌ను మట్టికరిపించి చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్‌ను గెలుచుకోగా తాజాగా ఇండియా ఓపెన్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.

ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన 22 ఏళ్ల శ్రీకాంత్ సూపర్ షోపై బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు. అతణ్ని ఓ పోరాట యోధుడిగా కొనియాడారు. అద్భుతమైన స్ట్రోక్ షాట్లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ దూసుకెళుతున్నాడని చెప్పారు. అయితే మున్ముందు దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేందుకు మరింత పరిణతి సాధించాల్సిన అవసరం ఉందని సూచించారు.
 
నిలకడగా ఆడితేనే: రాబోయే రోజుల్లో శ్రీకాంత్ మరిన్ని విజయాలు సాధించాలంటే నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. అదే అతడికి కీలకం కానుంది. ఇప్పటికైతే బాగా ఆడుతున్నాడు. ఎప్పుడైతే టైటిల్స్ గెలుస్తామో.. ప్రత్యర్థులకు అసాధ్యులుగా కనిపిస్తాము. కొందరు మ్యాచ్‌లను గెలిచినా హఠాత్తుగా పరాజయాల బాట పడుతారు. ఆ విషయంగా ఆలోచిస్తే శ్రీకాంత్ చాలా మెరుగ్గా ఉన్నాడు. మంచి స్ట్రోక్స్‌తో ఆటను తనవైపు తిప్పుకుంటున్నాడు.
 
మానసికంగా పరిణతి సాధించాలి: విజయాలను అలవాటుగా మార్చుకోవాలంటే మానసికంగా పరిణతి సాధించాల్సి ఉంటుంది. అలాగే శారీరకంగానూ ఫిట్‌గా ఉండాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలపై దృష్టి పెట్టాలి. భారీ స్మాష్, నెట్ గేమ్, స్ట్రోక్స్‌తో తను ప్రత్యర్థులకు అందకుండా ఉన్నాడు.
 
కల నిజమైనట్టుంది: ఇండియా ఓపెన్ టైటిల్స్‌ను సైనా, శ్రీకాంత్ గెలవడం కల నిజమైనట్టుగా ఉంది. నిజంగా అద్భుతం. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రణయ్, గురుసాయిదత్ ప్రదర్శన కూడా బావుంది. వీరంతా యువకులే కాబట్టి భవిష్యత్ విజయాలకు ఇది మంచి ప్రారంభంగా చెప్పుకోవచ్చు.
 
సైనా ర్యాంకుతో సంతోషం: ప్రపంచ నంబర్‌వన్‌గా సైనా నెహ్వాల్ నిలవడం అత్యద్భుతం. కొన్నేళ్లుగా ఆమెకు మంచే జరుగుతుంది. ఆటతీరులోనే కాకుండా కోర్టులోనూ చురుగ్గా కదులుతోంది. ఈ ర్యాంకు సైనాకే కాకుండా దేశంలోని క్రీడకు కూడా మేలు చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement