‘ఫైటర్‌’గా రౌడీ! | Vijay Devarakonda, Puri Jagannadh Movie Titled Fighter | Sakshi
Sakshi News home page

‘ఫైటర్‌’గా రౌడీ!

Published Thu, Aug 22 2019 3:21 PM | Last Updated on Thu, Aug 22 2019 3:51 PM

Vijay Devarakonda, Puri Jagannadh Movie Titled Fighter - Sakshi

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో త్వరలో ఓసినిమా పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం పూరి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. డియర్‌ కామ్రేడ్ ఫ్లాప్‌ కావటంతో విజయ్‌ కూడా పూరి సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఈ సినిమాకు ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. విజయ్‌ యాటిట్యూడ్‌కి, పూరి మార్క్‌ టేకింగ్‌కు ఈ టైటిల్‌ అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ డ్రామాతో పాటు, తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హీరో’ సినిమాల్లో నటిస్తున్నాడు విజయ్‌.

ఈ సినిమాలు పూర్తయిన వెంటనే పూరి సినిమా పట్టాలెక్కనుంది. ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న పూరి, విజయ్‌ దేవరకొండ సినిమాతో తన సక్సెస్‌ ట్రాక్‌ను కంటిన్యూ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పూరి, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement