ఎన్టీఆర్, రామ్‌చరణ్
‘ఆర్‌ఆర్‌ఆర్‌లో’ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోంది? రామ్‌చరణ్ మీసాలతో ఎలా కనిపించబోతున్నారు? అని ఊహించుకుంటున్న ఫ్యాన్స్‌కో గుడ్‌న్యూస్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో ఎన్టీఆర్–చరణ్‌ల లుక్ రివీల్ చేసే తేదీని రాజమౌళి ఫిక్స్ చేసేశారని తెలిసింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. డీవీవీ దానయ్య నిర్మాత. రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌కు హీరోయిన్ ఎవరూ ఫిక్స్ కాలేదు.
కొమర మ్ భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, చరణ్ కనిపిస్తారు. 1920లలో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందట. స్వాతంత్య్రం వచ్చిన రోజున స్వాతంత్య్ర సమరయోధులుగా వీరి లుక్స్ రిలీజ్ చేస్తే బావుంటుంది అనుకున్నారట. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, తమిళ నటుడు సముద్రఖని ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment