సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనీయర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లతో దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్'(రౌద్రం రణం రుధిరం). దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సంచలనమౌతోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీంగా, రామ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇద్దరూ స్టార్ హీరోలతో చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను దర్శకుడు ఒక్కోక్కోటిగా విడుదల చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాడు. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా అది సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 22న విడుదలైన కొమురం భీం టీజర్‌కు ఆన్‌లైన్‌లో విశేష స్పందన లభిస్తోంది. తెలుగు, తమిళం, హింది, మళయాలం భాషల్లో ఒకేరోజు విడుదలైన ఈ టీజర్‌కు దాదాపు 1.1 మిలియన్‌ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు టాలీవుడ్‌లో 2 లక్షలకు పైగా కామెంట్స్‌ను రాబట్టిన మొదటి టీజర్‌గా రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో మాత్రం కొమరం భీం టీజర్‌కు 32 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. (చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి దీపావళి సర్‌ప్రైజ్)
జూనీయర్ ఎన్టీఆర్ కొమురం భీంగా పరిచయం చేసిన ఈ టీజర్ చివరిలో ఎన్టీఆర్ ముస్లిం టోపి ధరించి కనిపిస్తాడు. దీంతో ఇది కాస్తా వివాదంలో చిక్కుకుంది. అప్పట్లో ఈ సన్నివేశాలు తొలగించాలని కొంత మంది డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ టీజర్ కంటే ముందు రామ్‌చరణ్ అల్లూరి సీతారామారాజు టీజర్ విడుదలైంది. దర్శకుడు రాజమౌళి రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రంలో అలియాభట్, ఓలివియా మోరీస్ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటైర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ దేవ్‌గన్, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తయారవుతున్న ఈ ఫిక్షనల్ పీరియాడిక్ చిత్రం 2021లో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. (చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఆ సీన్ తొలగించాల్సిందే)
Comments
Please login to add a commentAdd a comment