ఆర్ఆర్ఆర్‌ న్యూ అప్‌డేట్‌.. అక్టోబ‌ర్ 29న రెడీగా ఉండండంటూ ట్వీట్ | RRR Movie Team Going To Announce Crazy Update on October 29 | Sakshi
Sakshi News home page

RRR Movie: న్యూ అప్‌డేట్‌.. అక్టోబ‌ర్ 29న రెడీగా ఉండండంటూ ట్వీట్

Published Wed, Oct 27 2021 9:26 PM | Last Updated on Wed, Oct 27 2021 9:27 PM

RRR Movie Team Going To Announce Crazy Update on October 29 - Sakshi

టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్‌టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘రౌద్రం... రణం.. రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌)’. అల్లూరి సీతారామ‌రాజుగా మెగాపవర్‌ స్టార్‌.. కొమరం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. పలుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ ఫైన‌ల్‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.

ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఇప్పటికే విడుదలైన అల్లూరి, భీమ్‌ ఇంట్రడక్షన్‌ వీడియోలు రిలీజై మంచి రెస్పాన్స్‌ అందుకున్నాయి. కాగా ఈ మూవీ టీం సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించింది. దానికి కోసం అక్టోబర్‌ 29 వరకు వేచి చూడాలని తెలిపింది. ట్విటర్‌లో మూవీ టీం పెట్టిన పోస్ట్‌లో.. ‘ఇది వ‌ర‌కెన్న‌డూ చూడ‌ని, విన‌ని, ప్రపంచంలోనే ఇంతవరకు ఏ సినిమాకు లేని క‌ల‌యికను చూసేందుకు సిద్ధం అవ్వండి. ఇలాంటిది విషయం మొదటిసారి కానుంది. ఇదే రోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఎక్జ‌యిటింగ్ న్యూస్‌ మీకోసం ఎదురు చూస్తోంది’ అని తెలిపింది. ఆ సర్‌ప్రైజ్‌ గురించి తెలుసుకోవాలి అంటే మరో రెండు రోజు వెయిట్‌ చేయక తప్పదు.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రన్‌టైం ఎంతో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement