
భార్య ప్రణతి, కుమారుడు అభయ్‌రామ్‌తో ఎన్టీఆర్
చిన్న ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఎన్టీఆర్. భార్య, పిల్లలతో ఇటీవల దుబాయ్ వెళ్లారు. ఇది లాంగ్ ట్రిప్ అని చాలామంది అనుకున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం షార్ట్ ట్రిప్‌గానే ప్లాన్ చేసుకున్నారు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌తో బిజీ అయిపోతారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మళ్లీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొని, ట్రిప్ వెళ్లారు ఎన్టీఆర్. బుధవారం ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ కనిపించడం, కెమెరాలు క్లిక్‌మనడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment