భారత్ బ్యాంకింగ్‌కు మంచి రోజులు | Moody's Raises Indian Banks' Outlook to Stable | Sakshi
Sakshi News home page

భారత్ బ్యాంకింగ్‌కు మంచి రోజులు

Published Tue, Nov 3 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

భారత్ బ్యాంకింగ్‌కు మంచి రోజులు

భారత్ బ్యాంకింగ్‌కు మంచి రోజులు

న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ ‘అవుట్ లుక్’ను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మెరుగుపరిచింది. 2011 నవంబర్ నుంచీ ‘నెగటివ్’లో ఉన్న అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేసింది.  ఇప్పుడు బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని మూడీస్ పేర్కొంది. దీనివల్ల భవిష్యత్తులో మొండిబకాయిల స్పీడ్ తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ కారణంగానే అవుట్‌లుక్‌ను మెరుగుపరిచినట్లు వివరించింది.

రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో భారత్ బ్యాంకింగ్ వ్యవస్థకు ‘స్టేబుల్ అవుట్‌లుక్’ ఇస్తున్నట్లు మూడీస్ వీపీ, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ శ్రీకాంత్ వడ్లమాని తెలిపారు. ‘భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ అవుట్‌లుక్ : మెరుగుపడుతున్న నిర్వహణ : స్థిర అవుట్‌లుక్‌కు దారితీసిన పరిస్థితులు’ శీర్షికన మూడీస్ తాజా నివేదికను ఆవిష్కరించింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
     
* మొండిబకాయిల పరిస్థితి మెరుగుదల, స్థిర రీతిన మూలధనం అందే అవకాశం, లాభాలు పెరిగే పరిస్థితుల వంటివి అవుట్‌లుక్ పెంపునకు కారణం.
* కంపెనీల రుణాల పరిస్థితి భారంగా ఉంది. అందువల్ల మొండిబకాయిల విషయంలో రికవరీ నెమ్మదిగా ఉంటుంది.
* మొత్తంమీద భారత్ బ్యాంకింగ్ లాభదాయకత, నికర వడ్డీ మార్జిన్లు రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో స్థిరంగా ఉంటాయి.
* 2015, 2016లో స్థూల దేశీయోత్పత్తి రేటు (జీడీపీ) 7.5 శాతంగా ఉండే అవకాశం. దిగువ స్థాయిలో ద్రవ్యోల్బణం, వ్యవస్థాగత సంస్కరణల అమలు వంటి అంశాలు వృద్ధికి ఊతం ఇస్తున్నాయి. తగిన ద్రవ్య, పరపతి విధానం కూడా వృద్ధి వేగానికి దోహదపడే అంశం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement