కాజల్ అగర్వాల్
శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలో శర్వానంద్ డ్యూయెల్ రోల్ చేశారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.
బుధవారం కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ‘రణరంగం’ చిత్రంలోని ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో బీచ్ ఒడ్డున కాజల్ ఆనందంగా సందడి చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘మను చరిత్ర’ సినిమాకు కాజల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment