వందకి వంద | Shabaash Mithu first look poster out | Sakshi
Sakshi News home page

వందకి వంద

Published Thu, Jan 30 2020 5:48 AM | Last Updated on Thu, Jan 30 2020 5:48 AM

Shabaash Mithu first look poster out - Sakshi

‘సూర్మా’లో హాకీ ప్లేయర్, ‘సాండ్‌ కీ ఆంఖ్‌’లో షూటర్‌.. ఇలా క్రీడలకు సంబంధించిన పాత్రలను తాప్సీ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు దేశం గర్వపడేలా చేసిన భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ పాత్రలో ఆమె కనిపించనున్నారు. ‘శభాష్‌ మిథు’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలోని తాప్సీ లుక్‌ని బుధవారం విడుదల చేశారు. రాహుల్‌ థొలాకియా దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘‘నా జీవిత కథను ప్రపంచానికి చూపిస్తున్నందుకు థ్యాంక్స్‌ వయాకామ్‌ 18. మీరు కచ్చితంగా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు’’ అని మిథాలీ ట్వీట్‌ చేశారు.

అలాగే తాప్సీ పోస్టర్‌ చాలా బాగుందని ప్రశంసించారామె. ‘‘ఇప్పటివరకు నన్ను మీకు నచ్చిన క్రికెట్‌ క్రీడాకారుడు ఎవరు? అని చాలామంది అడిగారు. అయితే వాళ్లను మీ అభిమాన క్రికెట్‌ క్రీడాకారిణి ఎవరు? అని అడగాలి. అలాగే వాళ్లు క్రికెట్‌ని ఇష్టపడుతున్నారా? లేదా ఏ జెండర్‌ (ఆడ లేక మగ) ఆడుతున్నారనేదాన్ని బట్టి వాళ్ల ఇష్టం ఆధారపడి ఉంటుందా? ఏది ఏమైనా ‘మిథాలీ.. మీరు ఓ గేమ్‌ చేంజర్‌’’ అని పోస్టర్‌ రిలీజ్‌ సందర్భంగా తాప్సీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తాప్సీ లుక్‌కి వందకు వంద మార్కులు పడ్డాయి. 2021 ఫిబ్రవరి 5న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement