
ముంబై: నటిగా, బిజినెస్ ఉమెన్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ప్రియాంక చొప్రా తన కెరీర్‌లో మరో మైలు రాయికి చేరుకున్నారు. అమెజాన్ మల్టీ మిలియన్ డాలర్లు విలువ చేసే ఫస్ట్ లుక్ టెలివిజన్ డీల్‌పై ఆమె సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రియాంక రెండేళ్లపాటు అమెజాన్‌తో కలిసి పనిచేయనున్నారు. అది తెలిసి ‘థప్పడ్’ దర్శకుడు అనుభవ్ సిన్హా గతంలో ప్రియాంక గురించి ఓ మ్యాగజైన్‌లో వచ్చిన ఆర్టికల్‌ను ఈ సందర్భంగా గుర్తు చేశారు. (అమెజాన్‌తో ప్రియాంక భారీ డీల్)
Thappad nahi.. kaam se maaro.. 💪🏽 lol. Thank you @anubhavsinha for the support.. https://t.co/IkfzZcKCko
— PRIYANKA (@priyankachopra) July 1, 2020
అనుభవ్ ట్వీట్ చేస్తూ ‘అవును ఓ మ్యాగజైన్‌లో పేర్కొన్నట్లుగా కెరీర్‌లో మిమ్మల్ని ఎవరూ తాకలేరు ప్రియాంక’ అంటూ ట్విటర్ వేదికగా ప్రశంసించాడు. అది చూసిన ప్రియాంక ‘చెంప దెబ్బతో కాదు.. మీ సక్సెస్‌తో సమాధానం ఇవ్వండి. నాకు సపోర్టు చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. అంతేగాక ప్రియాంక అభిమానులు ఆమెపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. తన గురించి తెలియని ఎన్నో విషయాలను తన ‘అన్‌ఫినిష్డ్ పుస్తకం’లో పంచుకోవాలని కోరారు.