సినీ రంగాన్ని వేదిస్తున్న తీవ్ర సమస్యల్లో పైరసీ ఒకటి. ఇండస్ట్రీ వర్గాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పైరసీని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. అందుకే తమ సినిమాల ప్రమోషన్ సమయంలో పైరసీ వ్యతికేరంగా అభిమానులకు పిలుపునిస్తుంటారు స్టార్స్. అయితే తాజాగా ఓ దర్శకుడు తన సినిమాను పైరసీలో అయినా చూడండి అంటూ పిలుపునివ్వటం హాట్ టాపిక్ మారింది.
రిషి కపూర్, తాప్సీ, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రానాను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ముల్క్. హిందూ ముస్లింల మధ్య స్నేహానికి సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ పై పాకిస్తాన్ సెన్సార్‌బోర్డ్ నిషేదం విధించటంపై స్పందించిన దర్శకుడు అనుభవ్ సిన్హా తన సినిమాను పైరసీలో అయినా చూడండి అంటూ పాక్ ప్రజలకు పిలుపు నిచ్చారు.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన అనుభవ్ ‘ప్రియమైన నా పాకిస్తాన్ ప్రజలకు.. నేను తీసిన ముల్క్ సినిమాపై పాక్ సెన్సార్‌బోర్డ్ నిషేదం విధించింది. మీరంతా చట్టబద్ధంగా థియేటర్లలోనే నా సినిమా చూడాలని నాకూ ఉంది. కానీ అలా చూసే అవకాశం లేకపోతే పైరసీలో అయిన చూడండి. సినిమా చూసిన తరువాత సెన్సార్ బోర్డ్ ఈ చిత్రాన్ని నిషేందించిందో మీకే అర్ధమవుతుంది. ప్రస్తుతం పరిస్థితులు, నిజా నిజాలు మీకు తెలియకూడదనే సెన్సార్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది’ అన్నారు. అయితే అనుభవ్ సిన్హా వ్యాఖ్యలు పైరసీ ప్రొత్సహించే విధంగా ఉన్నయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment