నా సక్సెస్ కు తండ్రి మాటలే కారణం! | Father's advice made Sonu Nigam work harder | Sakshi
Sakshi News home page

నా సక్సెస్ కు తండ్రి మాటలే కారణం!

Published Sun, Aug 23 2015 3:25 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నా సక్సెస్ కు తండ్రి మాటలే కారణం! - Sakshi

నా సక్సెస్ కు తండ్రి మాటలే కారణం!

ముంబై: మన దైనందిన జీవితం ఎన్నో ఆశయాలు, లక్ష్యాలతో నిండి వుంటుంది. మనం ఏ పని చేయాలన్నా మూహూర్త బలం కన్నా సంకల్ప బలం గొప్పదంటంటారు. అయితే మన సంకల్ప బలం నెరవేరాలంటే చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించాలి. ప్రతీ మనిషి లక్ష్యం వెనుక స్థానిక పరిస్థితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా తన కెరీయర్  ఉన్నత స్థితికి వెళ్లడానికి ఇంట్లోని పరిస్థితులు అనుకూలించడమేనని అంటున్నాడు బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్. మన ఏ పని చేసినా ఆలోచన, ప్రణాళిక, కార్యాచరణ ఉండాలని తల్లి తండ్రులు చెప్పిన మాటలే తనను ఈరోజు ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందడానికి దోహద పడిందన్నాడు.ఎక్కువ కష్టించే తత్వం ఉండాలని ప్రత్యేకంగా తండ్రి చెప్పిన మాటలే తన జీవితానికి ఎంతో ఉపయోగపడ్డాయని సోనూ నిగమ్ స్పష్టం చేశాడు.

నాకు 17 -18 సంవత్సరాలప్పుడు ముంబైలో ఉండేవాళ్లం. ఆ సయమంలో తండ్రి చెప్పిన సలహా మాత్రం గొప్పగా అనిపించింది. తొలుత జీవితాన్ని ఎంజాయ్ చేస్తే.. తరువాత కష్టపడతావు. అదే జీవితంలో తొలుత కష్టపడితే తరువాత సుఖ పడతావు'అని తండ్రి చెప్పిన మాటలను సోనూ గుర్తు చేసుకున్నాడు. ఆ మాటలే తనను ఇంతటి స్థాయికి తీసుకొచ్చాయని పేర్కొన్నాడు. తన తండ్రి మాటలను విన్న మరుక్షణం నుంచే కష్టించే తత్వాన్ని అలవాటు చేసుకున్నానని తెలిపాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement