‘అతడికి గుండు కొడితే 10 లక్షలిస్తా’ | Sonu Nigam to get his head shaved to claim Rs 10 lakh fatwa on him | Sakshi
Sakshi News home page

‘అతడికి గుండు కొడితే 10 లక్షలిస్తా’

Published Wed, Apr 19 2017 12:45 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

‘అతడికి గుండు కొడితే 10 లక్షలిస్తా’

‘అతడికి గుండు కొడితే 10 లక్షలిస్తా’

కోల్ కతా: ఆలయాలు, మసీదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు సోనూ నిగమ్‌ పై ఫత్వా జారీ అయింది. ఆయనకు గుండు కొడితే 10 లక్షల రూపాయలు ఇస్తానని కోల్‌ కతాకు చెందిన ముస్లిం మత గురువు ప్రకటించారు. సోనూ నిగమ్‌ కు వ్యతిరేకంగా ఈ నెల 21న ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు.

‘సోనూ నిగమ్‌ తల గొరిగి.. అతడి మెడలో పాత చెప్పుల దండ వేసి, దేశమంతా తిప్పిన వారికి వ్యక్తిగతంగా నేను 10 లక్షల రూపాయలు ఇస్తాన’ని పశ్చిమ బెంగాల్‌ మైనారిటీ యునైటెడ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు సయిద్‌ షా అతిఫ్‌ అలీ ఆల్‌ ఖ్వాద్రి ప్రకటించారు.

దీనిపై సోనూ నిగమ్‌ ట్విటర్‌ లో స్పందించారు. ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఉంటానని, ఎవరైనా వచ్చి తనకు గుండు చేయొచ్చనని ట్వీట్‌ చేశారు. మీడియాను కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. తన ట్వీట్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్టు నిరూపిస్తే ఎక్కడికి రమ్మని చెబితే అక్కడకు వచ్చి క్షమాపణ చెబుతానన్నారు. మసీదుల గురించే కాకుండా ఆలయాలు, గురుద్వారాలు గురించి కూడా ప్రస్తావించానని గుర్తు చేశారు. లౌడ్‌ స్పీకర్ల ద్వారా మసీదులు, గుళ్లు, హరిద్వారాలు చేసే ఉపన్యాసాలు, ప్రార్థన పిలుపులను ‘గూండాగిరీ’గా అభివర్ణిస్తూ సోనూ నిగమ్‌ ట్వీట్లు చేయడంతో వివాదం రేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement