
'పాటలు పాడుతూ సెంచరీలు బాదేశాను'
టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యర్థులకు సింహస్వప్నం లాంటివాడు. అయితే తాను మ్యాచ్లాడుతున్నప్పుడు ఓ సింగర్ పాటలు పాడుతూ జోష్ పెంచి షాట్లు ఆడేవాడినని తెలిపాడు. ప్రముఖ ప్లే బ్లాక్ సింగర్ సోనూ నిగమ్ కు పుట్టినరోజు(జూలై 30) సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాడు. సింగర్ పుట్టినరోజునాడు సోనూ నిగమ్ పై తనకున్న అభిమానున్ని చాటుకున్నాడు వీరేంద్రుడు. తమిళం, తెలుగు, మరాఠీ, ఒడియా భాషలలో పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సోనూకు వీరూ కూడా చాలా పెద్ద అభిమాని.
బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ సింగర్ పాటలను హమ్ చేస్తూ బ్యాటింగ్ను ఎంజాయ్ చేసేవాడినని ట్వీట్ చేశాడు. 2010లో కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 'అబ్ ముజే రాత్ దిన్' పాట పాడిన విషయాన్ని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. ఆ ఇన్నింగ్స్ లో సెహ్వాగ్ సెంచరీ (165) సాధించడం విశేషం. క్రీజులో నిలబడి పాటలు పాడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం సెహ్వాగ్ ఆ విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించాడు.
Happy Bday @sonunigam ,Enjoyed singing many of ur songs while batting,"Ab mujhe Raat Din"when I scored165 vs SouthAfrica at EdenGardens,2010
— Virender Sehwag (@virendersehwag) July 30, 2016