గుండు కొట్టించుకున్నాను.. 10 లక్షలేవి? | sonu nigam tonsures his head in protest | Sakshi
Sakshi News home page

గుండు కొట్టించుకున్నాను.. 10 లక్షలేవి?

Published Wed, Apr 19 2017 3:18 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

గుండు కొట్టించుకున్నాను.. 10 లక్షలేవి?

గుండు కొట్టించుకున్నాను.. 10 లక్షలేవి?

తనకు గుండు కొట్టించిన వాళ్లకు రూ. 10 లక్షలు ఇస్తానని ఫత్వా జారీ చేయడంపై ప్రముఖ గాయకుడు సోను నిగమ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో తీవ్రంగా స్పందించిన ఆయన.. తాను స్వయంగా గుండు కొట్టించుకున్నారు. ఆ పది లక్షలు ఏవని సదరు మౌల్వీని ప్రశ్నించారు. సోనూ నిగమ్‌ తల గొరిగి.. అతడి మెడలో పాత చెప్పుల దండ వేసి, దేశమంతా తిప్పిన వారికి వ్యక్తిగతంగా తాను 10 లక్షల రూపాయలు ఇస్తానని పశ్చిమ బెంగాల్‌ మైనారిటీ యునైటెడ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు సయిద్‌ షా అతిఫ్‌ అలీ ఆల్‌ ఖ్వాద్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాను జీవితాంతం మహ్మద్ రఫీని తన తండ్రిలా భావించానని, అలాగే తన గురువు పేరు కూడా ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ సాహబ్ అని సోను నిగమ్ అన్నారు. అలాంటి తన మీద ఇలా బురద చల్లడానికి, ముస్లిం వ్యతిరేకి అనడానికి ఎలా నోళ్లు వచ్చాయన్నారు. అది తన సమస్య కాదని, వాళ్ల సమస్య అని అన్నారు. కాగా అంతకుముందే ఆయన తాను గుండు కొట్టించుకుంటానని చెప్పి, అందుకు మీడియావాళ్లను కూడా పిలిచారు. దీనిపై ఆయన వరుసపెట్టి ట్వీట్లు కూడా చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement