
'ఆ ఒక్కరు తప్ప.. ఎవరికైనా..'
న్యూఢిల్లీ: భారత దేశంలో తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఎవరికైనా ఉందని అయితే, ఒక్క సెలబ్రిటీకి మాత్రం లేదని ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ భిన్నంగా స్పందించారు. దేశంలో అసహన పరిస్థితులు, భావ వ్యక్తీకరణపై సోనూ శుక్రవారం తన అభిప్రాయాలను ట్విట్టర్లో పంచుకున్నాడు. 'ఒక్క సెలబ్రిటీ తప్ప ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయాన్ని కలిగిఉండే హక్కు ఉంది. అయితే, ఇది నా అభిప్రాయం మాత్రం కాదు.
ఎందుకంటే నేను ఇలాంటివాటికి విరుద్ధమైనవాడిని.. అస్సలు మద్ధతివ్వను' అని ఆయన చెప్పారు. భారత్‌లో అసహన పరిస్థితులు పెరిగాయని వ్యాఖ్యలు చేసి పలు విమర్శల పాలై ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతున్న సమయంలో తాజాగా సోనూ తన అభిప్రాయాన్ని ప్రకటించారు.