#AyodhyaRamMandir శతాబ్దాల సుధీర్ఘ నిరీక్షణ ఫలించిన వేళ... ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఘనంగా జరిగింది. ఈ వైభవాన్నిప్రత్యక్షంగా, పరోక్షంగా కన్నులారా వీక్షించిన భక్తుల రామనామ స్మరణతో యావద్దేశం పులకించిపోయింది. ఈ సందర్బంగా కొన్ని విశేషాలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ కార్యక్రమం అనంతరం అక్కడున్న వారినందరినీ ప్రధాని మోదీ పలకరించారు. ప్రముఖగా బాలీవుడ్ నటుడు బిగ్‌బీ, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లతోపాటు, రిలయన్స్ అధినేత అంబానీ దంపతులను పలకరించి అభివాదం చేశారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఆనంద పరవశంలో మునిగి జైశ్రీరామ్ అంటూ నినదించింది.
రామ మందిరాన్ని చూసి, ఆనంద పరవశంలో నటి కంగనా రనౌత్. #AyodhaRamMandir pic.twitter.com/KsynLcVD92
— Actual India (@ActualIndia) January 22, 2024
అలాగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయోధ్య తరలివెళ్లిన బాలీవుడ్ నటులు దిగిన సెల్ఫీ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.
రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలో బాలీవుడ్ సుభాష్ ఘాయ్ అంబానీ కోడలు శ్లోకా అంబానీతోపాటు బీ-టౌన్ ప్రముఖులతో కలిసి సెల్ఫీ తీసుకోవడం విశేషం.
అలాగే బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ భావోద్వేగానికి గురయ్యాడు. అభి కుచ్ బోల్నే కో హై నహీ, బస్ యాహీ (కన్నీళ్లు) బోల్నే కో హై. (ఇపుడిక మాట్లాడానికి ఏమీలేదు ఆనంద బాష్పాలు తప్ప అంటూ ఆయన పరవశించిపోయారు. ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో సోను నిగమ్ 'రామ్ సియారామ్' పాటను ఆలపించారు.
#WATCH | Ayodhya, Uttar Pradesh | Singer Sonu Nigam gets emotional; says, "...Abhi kuch bolne ko hai nahi, bas yahi (tears) bolne ko hai."#RamTemplePranPratishtha pic.twitter.com/6yoZ4s8APy
— ANI (@ANI) January 22, 2024
#WATCH | Singer Anuradha Paudwal sings Ram Bhajan at Shri Ram Janmaboomi Temple in Ayodhya ahead of the Pran Pratishtha ceremony. pic.twitter.com/ZuKe4w5FCm
— ANI (@ANI) January 22, 2024
కాగా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు అమితాబ్ బచ్చన్ నుండి సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుల గాత్రంతో అయోధ్యనగరి రామభజనలతో ఉర్రూతలూగింది. ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు ప్రముఖ గాయకులు రామ్ భజనలు ఆలపించారు. అనురాధ పౌడ్వాల్, శంకర్ మహదేవన్, సోనూ నిగమ్‌ల మధురమైన గాత్రాలకు రామ్ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.
Comments
Please login to add a commentAdd a comment