అతడు కృతజ్ఞత లేని వాడు: నటి | Actor Divya Khosla Fires On Singer Sonu Nigham | Sakshi
Sakshi News home page

అతడు కృతజ్ఞత లేని వాడు: నటి

Published Tue, Jun 23 2020 4:39 PM | Last Updated on Tue, Jun 23 2020 5:25 PM

Actor Divya Khosla Fires On Singer Sonu Nigham - Sakshi

ముంబై: ముంబై: గాయకుడు సోనూ నిగమ్‌పై టీ-సిరీస్‌ యజమాని భూషణ్‌ కుమార్‌ భార్య, నటి దివ్వ కొస్లా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ధ్వజమెత్తారు. సోనూ నిగమ్‌ అబద్ధాలు చెబుతాడని, కృతజ్ఞత లేనివాడని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ‘ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేస్తూ వాటిని నమ్మిస్తూ క్యాంపయిన్‌ చేస్తున్నారో.... #సోనూ నిగమ్‌, అలాంటి వారికి ప్రేక్షకులు మనోభావాలతో ఎలా ఆడుకోవాలో కూడా తెలుసు, దేవుడా నువ్వే కాపాడాలి ’ అని దివ్వ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. (అది తన‌ హృదయ లోతుల్లోనే అంతమైంది: నటి)

తన భర్త భూషణ్‌ కుమార్‌ను టార్గెట్‌ చేయడం ద్వారా సోనూ నిగమ్‌ పాపులారిటీ పొందాలని చూస్తున్నాడని దివ్వ ఆరోపించారు. ‘సోనూ నిగమ్‌ జీ టీ-సిరీస్‌ పరిశ్రమలో మీకు మంచి గుర్తింపునిచ్చింది. మీకు భూషణ్‌తో ఇబ్బంది ఉంటే మీరు ముందే ఎందుకు చెప్పలేదు. మీరు పబ్లిసిటీ కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నేను, మీ నాన్నగారు  చేసిన ఎన్నో మ్యూజిక్‌ వీడియోలకు దర్శకత్వం  వహించాను. మీ నాన్న గారు ఆ విషయంలో ఎప్పుడు కృతజ్ఞతగానే ఉన్నారు.  కానీ కొంతమందికి కృతజ్ఞత ఉండదు’ అని దివ్య తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేశారు.

మ్యూజిక్‌ పరిశ్రమలో భూషణ్‌ మాఫియా నడుపుతున్నారంటూ సోనూ  నిగమ్‌ అంతకుముందు ఆరోపించారు. భూషణ్‌ తనకు వ్యతిరేకంగా కొందరు కళాకారులు మాట్లాడేలా చేశారని, ఆ వ్యాఖ్యలను వెనక్కి  తీసుకోకపోతే మెరీనా కువార్‌ వీడియోను యూట్యూబ్‌లో ప్లే చేస్తానని బెదిరించారని నిగమ్‌ ఆరోపించారు. (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్‌)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement