T-Series
-
విడాకులకు సిద్ధమవుతున్న హీరోయిన్? క్లారిటీ ఇచ్చిన భర్త
టీ-సిరీస్ అధినేత, ఆదిపురుష్ నిర్మాత భూషణ్ కుమార్,నటి దివ్య ఖోస్లా కుమార్ జంట విడాకులకు సిద్ధమతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లవ్ టుడేతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన దివ్యా ఖోస్లా ఇన్‌స్టా ఐడీలో ‘కుమార్’ అనే ఇంటిపేరును తొలగించడంతో విడాకుల పుకార్లకు తెర లేచింది. అంతేకాదు పేరుకు ముందు 's' ని కూడా జోడించడంతో మరిన్నిసందేహాలు వెల్లువెత్తాయి. అంతేకాదు భర్త భూషణ్ కుమార్ మ్యూజిక్ సంస్థ టీ-సిరీస్ సోషల్ మీడియా ఖాతాను కూడా అన్‌ఫాలో చేసింది. అయితే ఇవన్నీ పుకార్లేనని భరత్‌భూషణ్ టి-సిరీస్ టీం క్లారిటీ ఇచ్చింది. దివ్య ఖోస్లా తన ఇంటిపేరు తొలగింపునకు కారణం జ్యోతిష్య శాస్త్రం, ఇది వ్యక్తిగత నిర్ణయమని దీన్ని గౌరవించాలని టీ సిరీస్‌కి ప్రతినిధి వెల్లడించారు. పేరు ముందు 's' చేర్చడం వెనకాల కూడా ఇదే కారణమని స్పష్టతనిచ్చారు. ఈ జంట చాలా హ్యాపీగా ఉన్నారని తెలిపారు. 90ల నాటి పాప్ సంగీతంలో తళుక్కున మెరిసిన ముద్దుగుయ్యే దివ్యా ఖోసలా. ఫల్గుణి పాఠక్ మ్యూజిక్ వీడియో ‘అయ్యో రామ’ పెద్ద సంచలనమే సృష్టించింది.తన గ్లామర్‌తో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సరసన జిద్ నా కరో యే దిల్ కాతో సహా అనేక మ్యూజిక్ వీడియోలో కనిపించింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత దివ్య ఖోస్లా కుమార్ ప్రధాన పాత్రలో ‘హీరో హీరోయిన్’ మూవీ,తెలుగు, హిందీలో విడుదల కానుంది. సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేరణ అరోరా నిర్మిస్తున్న ఈ సినిమాఫస్ట్ లుక్ పోస్టర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. View this post on Instagram A post shared by Divyakhossla (@divyakhossla) 2005 ఫిబ్రవరి 13న భూషణ్ కుమార్‌ను పెళ్లాడింది. 19 ఏళ్ల వైవాహిక జీవితంలో ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు ద బ్రేక్ తీసుకున్న దివ్య 2016లో సనమ్ రే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. చివరిగా మీజాన్ జాఫ్రీ , పెరల్ వి పూరితో కలిసి రొమాంటిక్ డ్రామా 'యారియన్ 2'లో కనిపించింది. నటిగానే కాదు నిర్మాతగా కూడా అవతరించింది. -
సోనూ నిగమ్‌పై నటి సంచలన వ్యాఖ్యలు
ముంబై: సింగర్ సోనూ నిగమ్‌కు, గ్యాంగ్‌స్టర్ అబూ సలీంకు మధ్య సంబంధాలు ఉన్నాయని దర్శకురాలు, నటి దివ్వ ఖోస్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సుశాంత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా సంగీత పరిశ్రమలో కూడా పెద్ద మాఫియా ఉందంటూ సోనూ నిగమ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక టీ-సీరిస్ యాజమానికి భూషణ్ కుమార్, అబూ సలీం నుంచి తనకు ప్రాణహానీ ఉందని అతడిని నుంచి రక్షించాలని వేడుకున్నాడంటూ ఇటీవల ట్వీట్ చేశాడు. (అతడు కృతజ్ఞత లేని వాడు: నటి) దీంతో సోనూ నిగమ్ వ్యాఖ్యలను ఖండిస్తూ భూషణ్ కుమార్ భార్య దివ్వ ఖోస్లా సోషల్ మీడియాలో గురువారం వీడియోను షేర్ చేశారు. ‘‘గత కొద్ది రోజులుగా సోనూ నిగమ్ టి-సిరీస్, యాజమాని భూషణ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. పరిశ్రమలో సంబంధం లేని సంగీత దర్శకులకు, గాయకులకు, నటులకు, ప్రతిభ ఉన్న ఎంతోమంది బయట వ్యక్తులకు టీ-సిరీస్ సహాయపడింది. దర్శకురాలిగా నేను కొత్తవారికి అవకాశం ఇచ్చాను. వారిలో నలుగురు నేహా కక్కర్, రకుల్ ప్రీత్ సింగ్, హిమాన్ష్ కోహ్లి, స్వరకర్త ఆర్కో వృద్ది ఇప్పడు మంచి స్థాయికి ఎదిగారు’’ అంటూ చెప్పకొచ్చారు. (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్) అంతేగాక సోనూ నిగమ్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘సోషల్ మీడియాలో నిజాలను దాచడం సులభమే. కానీ ఓ గాయకుడిగా మీరు ఎంతమంది కింది స్థాయి ప్రతిభావంతులను ముందుకు తీసుకువచ్చారో చెప్పండి. మీరు తప్ప మరెవరికి అవకాశం ఇవ్వలేదు. అలాంటి మీరు ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారా? వాస్తవానికి టీ-సిరీస్‌లో పనిచేసే 97 శాతం మంది బయటి వారే. వారికి పరిశ్రమలో ఎలాంటి సంబంధాలు లేవు. పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పిల్లలు కూడా కాదు. మేము ఎప్పుడూ ప్రతిభ ఉన్న కొత్తవారి కోసమే చూస్తాము’’ అని చెప్పారు. -
అతడు కృతజ్ఞత లేని వాడు: నటి
ముంబై: ముంబై: గాయకుడు సోనూ నిగమ్‌పై టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ భార్య, నటి దివ్వ కొస్లా ఇన్స్టాగ్రామ్ వేదికగా ధ్వజమెత్తారు. సోనూ నిగమ్ అబద్ధాలు చెబుతాడని, కృతజ్ఞత లేనివాడని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ‘ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేస్తూ వాటిని నమ్మిస్తూ క్యాంపయిన్ చేస్తున్నారో.... #సోనూ నిగమ్, అలాంటి వారికి ప్రేక్షకులు మనోభావాలతో ఎలా ఆడుకోవాలో కూడా తెలుసు, దేవుడా నువ్వే కాపాడాలి ’ అని దివ్వ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. (అది తన హృదయ లోతుల్లోనే అంతమైంది: నటి) తన భర్త భూషణ్ కుమార్‌ను టార్గెట్ చేయడం ద్వారా సోనూ నిగమ్ పాపులారిటీ పొందాలని చూస్తున్నాడని దివ్వ ఆరోపించారు. ‘సోనూ నిగమ్ జీ టీ-సిరీస్ పరిశ్రమలో మీకు మంచి గుర్తింపునిచ్చింది. మీకు భూషణ్‌తో ఇబ్బంది ఉంటే మీరు ముందే ఎందుకు చెప్పలేదు. మీరు పబ్లిసిటీ కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నేను, మీ నాన్నగారు చేసిన ఎన్నో మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను. మీ నాన్న గారు ఆ విషయంలో ఎప్పుడు కృతజ్ఞతగానే ఉన్నారు. కానీ కొంతమందికి కృతజ్ఞత ఉండదు’ అని దివ్య తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. మ్యూజిక్ పరిశ్రమలో భూషణ్ మాఫియా నడుపుతున్నారంటూ సోనూ నిగమ్ అంతకుముందు ఆరోపించారు. భూషణ్ తనకు వ్యతిరేకంగా కొందరు కళాకారులు మాట్లాడేలా చేశారని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే మెరీనా కువార్ వీడియోను యూట్యూబ్‌లో ప్లే చేస్తానని బెదిరించారని నిగమ్ ఆరోపించారు. (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్) -
మీటూ : తనతో గడిపితే సూపర్‌స్టార్‌ను చేస్తానన్నాడు
ముంబై : మీటూ ఉద్యమ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలతో ముందుకొచ్చారు. మూడేళ్ల కిందట తనతో టి సిరీస్ బ్యానర్‌పై మూడు సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదిరిన క్రమంలో తనతో ఓ రాత్రి గడిపితే తనను సూపర్‌స్టార్‌ను చేస్తానని భూషణ్ కుమార్ తన కోర్కెను బయటపట్టారని ఆ మహిళ ట్వీట్ చేశారు. తాను భూషణ్‌ను తొలిసారి ఆయన కార్యాలయంలో కలిశానని, మరుసటి రోజే మూడు సినిమాల్లో తాను నటించేలా ఒప్పందంపై సంతకాలు జరగాల్సి ఉందని చెప్పారు. తర్వాతి రోజు ఉదయం భూషణ్ ఫోన్ నుంచి సాయంత్రం తన బంగళాలో కలవాలని మెసేజ్ వచ్చిందని అందుకు తాను అభ్యంతరం వ్యక్తం చేశానని చెప్పుకొచ్చారు. తనతో సంబంధం కొనసాగించేందుకు సమ్మతిస్తే సూపర్‌స్టార్‌ను చేస్తానని ప్రలోభపెట్టారన్నారు. సినిమా అవకాశాల కోసం తాను ఎవరితోనైనా గడపాల్సివస్తే అవకాశాలనే తాను వదులుకుంటానని తాను ఆయనకు తిరిగి మెసేజ్ చేశానని సదరు మహిళ పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు మూడు సార్లు తనను కలిసినప్పుడూ ఇలానే ఒత్తిడి చేయగా తాను నిరాకరించానని, ఈ విషయం ఎవరికైనా చెబితే సిటీలో బతకకుండా చేస్తానని హెచ్చరించాడని వాపోయారు. భూషణ్‌తో గడిపేందుకు తాను అంగీకరించకపోవడంతో సినిమా నుంచి తనను తప్పిస్తున్నట్టు టి-సిరీస్ ప్రతినిధులు చెప్పారని పేర్కొన్నారు. కాగా, తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. నిరాధార ఆరోపణలు చేసిన మహిళపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. -
భయపడుతున్న కంగనా రనౌత్
ముంబై: మొన్న ‘క్వీన్’, నేడు ‘తనూ వెడ్స్ మను రిటర్న్స్’ హిట్లతో బాలీవుడ్లో దూసుకుపోతున్న హీరోయిన్ కంగనా రనౌత్‌కు తాను ఎప్పుడో నటించిన సినిమా ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉండడంతో భయం పట్టుకుంది. దీంతో ఆ సినిమా నిర్మాతలైన టీ-సిరీస్‌కు లీగల్ నోటీసు కూడా జారీ చేసింది. ఆ సినిమా ఇప్పుడు తమ చేతుల్లో లేదని, ఎప్పుడో అమ్మేశామని, పైగా తనకు రావాల్సిన రెమ్యూనరేషన్‌ను నయాపైసతో సహా చెల్లించేశామంటూ టీ సిరీస్ నుంచి సమాధానం రావడంతో కంగనా రనౌత్ కంగుతింది. ఆమె 2011లో ‘ఐ లవ్ న్యూ ఇయర్’ అనే సినిమాలో హీరో సన్నీ డియోల్ సరసన నటించింది. ఇప్పుడు ఆ సినిమాను జూలై 10న విడుదల చేస్తున్నట్టు ఆ సినిమాను కొనుగోలు చేసిన టీ-సిరీస్ అనుబంధ సంస్థ ప్రకటించడంతో కంగనాకు కంగారు ఎక్కువైంది. ఆ సినిమా అట్టర్ ఫ్లాపైతే తన ఇమేజ్ దెబ్బతింటుందన్నది ఆమె భయం. రష్యన్ చిత్రం ‘ఐరనీ ఆఫ్ ఫేట్’ స్ఫూర్తితో తీసిన ‘ఐ లవ్ న్యూ ఇయర్’ చిత్రానికి రాధికా రావు, వినయ్ సాప్రులు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2011లోనే పూర్తయిన ఇప్పటి వరకు రిలీజ్‌కు నోచుకోలేదు. ట్రెయిలర్లకు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో విడుదల తీదీలు వరుసగా వాయిదా పడుతూ వచ్చాయి. రాధికా రావు, వినయ్ సాప్రులు ఇంతకుముందు సల్మాన్ ఖాన్ ఫ్లాప్ సినిమా ‘లక్కీ: నో టైమ్ టు లవ్’కు దర్శకత్వం వహించారు.