![An Actress Opened Aganst Bhushan Kumars Alleged Sexual Misconduct - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/14/bhushan.jpeg.webp?itok=AwKPQv78)
టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ (ఫైల్‌ఫోటో)
ముంబై : మీటూ ఉద్యమ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలతో ముందుకొచ్చారు. మూడేళ్ల కిందట తనతో టి సిరీస్ బ్యానర్‌పై మూడు సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదిరిన క్రమంలో తనతో ఓ రాత్రి గడిపితే తనను సూపర్‌స్టార్‌ను చేస్తానని భూషణ్ కుమార్ తన కోర్కెను బయటపట్టారని ఆ మహిళ ట్వీట్ చేశారు. తాను భూషణ్‌ను తొలిసారి ఆయన కార్యాలయంలో కలిశానని, మరుసటి రోజే మూడు సినిమాల్లో తాను నటించేలా ఒప్పందంపై సంతకాలు జరగాల్సి ఉందని చెప్పారు.
తర్వాతి రోజు ఉదయం భూషణ్ ఫోన్ నుంచి సాయంత్రం తన బంగళాలో కలవాలని మెసేజ్ వచ్చిందని అందుకు తాను అభ్యంతరం వ్యక్తం చేశానని చెప్పుకొచ్చారు. తనతో సంబంధం కొనసాగించేందుకు సమ్మతిస్తే సూపర్‌స్టార్‌ను చేస్తానని ప్రలోభపెట్టారన్నారు. సినిమా అవకాశాల కోసం తాను ఎవరితోనైనా గడపాల్సివస్తే అవకాశాలనే తాను వదులుకుంటానని తాను ఆయనకు తిరిగి మెసేజ్ చేశానని సదరు మహిళ పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు మూడు సార్లు తనను కలిసినప్పుడూ ఇలానే ఒత్తిడి చేయగా తాను నిరాకరించానని, ఈ విషయం ఎవరికైనా చెబితే సిటీలో బతకకుండా చేస్తానని హెచ్చరించాడని వాపోయారు.
భూషణ్‌తో గడిపేందుకు తాను అంగీకరించకపోవడంతో సినిమా నుంచి తనను తప్పిస్తున్నట్టు టి-సిరీస్ ప్రతినిధులు చెప్పారని పేర్కొన్నారు. కాగా, తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. నిరాధార ఆరోపణలు చేసిన మహిళపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment