ఎవరు, ఎందుకు, ఎక్కడ : సోనూ సూద్ | Sonu Sood gets trolled for Sonu Nigam controversial tweets | Sakshi
Sakshi News home page

ఎవరు, ఎందుకు, ఎక్కడ : సోనూ సూద్

Published Tue, Apr 18 2017 2:09 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

ఎవరు, ఎందుకు, ఎక్కడ : సోనూ సూద్

ఎవరు, ఎందుకు, ఎక్కడ : సోనూ సూద్

స్టైలిష్ యాక్టర్గా టాలీవుడ్ బాలీవుడ్ సినీ అభిమానులను అలరిస్తున్న సోనూసూద్, అనుకోని చిక్కుల్లో ఇరుక్కున్నాడు. తనకు సంబంధం లేని విషయంలో నెటిజన్లు తనపై హేట్ కామెంట్స్ చేస్తుండటంపై ఆశ్యర్యం అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల గాయకుడు సోనూనిగమ్ మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ముస్లిం లు చేసే నమాజ్ ను ఉద్దేశించి,' ఇలా రోజు ప్రజల్ని బలవంతం నిద్రలేపటం ఎంత వరకు సమజసం' అంటూ కామెంట్ చేశాడు.

సోనూ నిగమ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ట్విట్టర్ పేజ్ లో సోనూ అని టైప్ చేయగానే ముందుగా సోనూ సూద్ పేరు వస్తుండటంతో నెటిజన్ లు సోనూ నిగమ్ కు బదులు సోనూసూద్ ను ట్యాగ్ చేస్తూ హేట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై అసహనం వ్యక్తం చేసిన సోనూసూద్  'ఎవరు ఎవరితో ఏం చెప్పారు. దాని గురించి ఎవరు ఎందుకు నన్ను అడుగుతున్నారు. నాసా దీని గురించి రిసెర్చ్ చేస్తోంది. నేను ఇందులోకి ఎలా వచ్చాను?' అంటూ కామెంట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement