సాక్షి, ముంబై: బాలీవుడ్‌లో మంచి టాలెంట్ ఉన్న యువ కళాకారులకు అవకాశాలు లభించడం లేదనీ, పెద్ద మ్యూజిక్ మాఫియా నడుస్తోందంటూ గతంలో సంచలనం రేపిన ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ (47) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు నీవన్ తన వృత్తిలో (గాయకుడిగా) ఉండాలని కోరుకోవడం లేదన్నారు. అంతేకాదు అదీ భారతదేశంలో నీవన్‌ను సింగర్‌గా చూడాలని తాను కోరుకోవడం లేదన్నారు. ప్రస్తుతం అతను దుబాయ్‌లో ఉంటున్నప్పటికీ ఇండియాలో గాయకుడిగా చెలామణి కావాలని తాను భావించడం లేదంటూ టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ ఈ వ్యాఖ్యలు చేశారు. (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్)
గాయకుడిగా మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ, తన కుమారుడు గాయకుడిగా ఉండాలని కోరుకోవడం లేదని సోనూ తెగేసి చెప్పారు. చాలా తెలివైనవాడు, మంచి గాత్రంతో పాటు గేమింగ్ రంగంలో మంచి టాలెంట్ ఉన్న నీవన్ ప్రస్తుతం గేమింగ్ రంగంలో రాణిస్తున్నాడని చెప్పారు. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) లో టామ్ గేమర్‌లలో ఒకడిగా కొనసాగుతున్నాడని తెలిపారు. అలాగే పిల్లలు భవిషత్తులో ఏం కావాలో శాసించడం తనకిష్టం ఉండదనీ, తనకు తానుగా ఎలా రాణిస్తాడో చూద్దాం.. అని ఆయన పేర్కొన్నారు.
కాగా తన తండ్రితో అనేక వేదికలపైనా, స్టూడియోలలలో తన ముద్దు ముద్దు ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు నీవన్. దీంతోపాటు ఇటీవల ఆన్‌లైన్ కన్సర్ట్‌లో సోనూతో కలిసి ఒక షో కూడా చేశాడు. సోనూ నిగమ్ ప్రస్తుతం తన కొత్త పాట ‘ఈశ్వర్ కా వో సచ్చా బాందా ’ విడుదలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment