సోనూ నిగం సంచలన నిర్ణయం, ట్వీట్లు
ముంబై: బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్(43) సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఇవాల్టి నుంచి తాను ట్విట్టర్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. మంగళవారం వరుస ట్వీట్లలో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. సింగర్ అభిజీత్ భట్టాచార్య అకౌంట్‌ను ట్విట్టర్ తొలగించడాన్ని సోనూ తీవ్రంగా తప్పుబట్టిన తన ట్విట్టర్ ఖాతాను రద్దు చేశాడు.
భావ ప్రకటన స్వేచ్ఛకు గౌరవం లేని చోట తాను ఉండదలచుకోలేదని సోనూ స్పష్టం చేశాడు. బీజేపీపీ ఎంపీ,నటుడు, పరేష్‌రావెల్, అభిజిత్ వివాదాస్పద ట్వీట్లను వెనకేసుకొచ్చిన సోనూ మొత్తం 24 ట్వీట్లలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నిద్రపోతున్న వాళ్లని మేల్కొల్పవచ్చు గానీ.. నిద్ర నటిస్తున్నవారిని నిద్ర లేపడం కష్టమని తనకు అర్థమైందంటూ వాపొయాడు. పనిలోపనిగా మీడియాపై విమర్శలు గుప్పించాడు.మీడియా జాతీయవాదులుగా,కోల్డ్ బ్లడెడ్ సూడోలుగా చీలిపోయిందని,దోహద్రోహుల గురించి తెలుసుకోవడానికి వీరు సిద్ధంగా లేరంటూ దుయ్యబట్టాడు. అంతేకాదు కాసేపట్లో తన అకౌంట్ ఉండబోదని అందుకే తన ట్వీట్లను ముందే స్క్రీన్‌షాట్స్ తీసుకోవాలంటూ మీడియాకు కూడా సలహా ఇచ్చాడు. తను ట్విట్టర్ ను వీడడం సుమారు 7మిలియన్ల తన ఫాలోయర్లకు బాధకలింగవచ్చని..అలాగే కొంతమంది సాడిస్టులకు ఆనందంగా ఉంటుందటూ ట్వీట్ చేశాడు.
ట్విట్టర్ సంయమనం పాటించడంలేదనీ, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డాడు. "బ్యాలెన్స్ ఎక్కడ ఉందంటూ ట్వీట్ చేశాడు సున్నితమైన చర్చ ఎందుకు జరగడంలేదని అని ప్రశ్నించాడు..ప్రజలు "మానవులు ఉండటం నిలిపివేశారు" ప్రౌడ్ ముస్లిం, హిందువు, పాకిస్థానీయులుయ భారతీయులుగా ఉంటున్నారు తప్ప అంతకు మించి లేరని ఒక ట్వీట్‌లో రాసుకొచ్చాడు. చివరగా తను ట్విట్టర్‌కు వ్యతిరేకం కాదంటూ అభిమానులకు వివరణ ఇచ్చాడు. కానీ ట్విట్టర్ ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. ట్విట్టర్ గ్రేటర్ ప్లాట్‌ఫాంగా నిలవొచ్చు అంటూనే.. థియేటర్లలో చూపించే పోర్న్ షోతో ట్విట్టర్ నో పోల్చాడు.
కాగా బీజేపీఎంపీ పరేష్ రావల్ కశ్మీర్‌లో ఆర్మీ వాహనానికి రాళ్లురువ్వే యువకుడికి బదులుగా,ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్‌ని కట్టాంటూ ట్వీట్ చేయడం వివాదాన్ని సృష్టించింది. జేఎన్‌యూ విద్యార్థిని సెహ్లా రహీద్ పట్ల అసభ్యకర ట్వీట్లు చేశాడన్న కారణంతో అభిజీత్ అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో సోనూకు 6.5 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.