సోనూతో గొంతు కలిపిన గడ్కారీ
Published Wed, Dec 4 2013 11:57 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంతో వేడెక్కిన వాతావరణంలో కాకలు తీరిన నేతలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయం ఇది. బుధవారం సమావేశానికి హాజరైన బీజేపీ నేత నితిన్ గడ్కారీ ప్రసిద్ధ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్‌తో గొంతు కలి పాడు. ఇండియా టుడే గ్రూప్ మీడియా నిర్వహించి న ఎజెండా ఆజ్‌తక్ సమావేశంలో గడ్కారీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తొలుత ‘సోనూ కీ సర్గమ్’ పేరుతో సోనూ నిగమ్ సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదే సమావేశంలో రెండవ సెషన్ లో గడ్కారీ మాట్లాడాల్సి ఉంది. సోనూ కచేరీ వినడానికి సిద్ధమైన గడ్కారీ సోనూనిగమ్ తన అభిమాన గాయకుల్లో ఒకడని పేర్కొన్నాడు. తనకు ఇష్టమైన ‘సందేశే అతే హై’ పాటను కోరాడు.
సోనూ మాట్లాడుతూ‘బార్డర్‌లోని ఈ పాట నా వృత్తి జీవితంలో ముఖ్యమైనది. బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి ఈ పాట నాకు ఊతమైంది’ అని వివరించి పాట ఆలపించాడు. తర్వాత గడ్కారీ సోనూతో కలిసి ‘తుజ్‌సే నారాజ్ నహీ జిందగీ... హైరాన్ హూ మై’ అనే పాటను ఆల పించాడు. 1983లో విడుదలైన మౌసమ్ చిత్రంలోని ఈ గీతం ఎన్నికల నేపథ్యంలో గడ్కారీ మానసిక స్థితికి అద్దం పట్టినట్లుగా అనిపించింది. తర్వాత సంగీత పరిశ్రమలో చోట్టు చేసుకుంటున్న కొత్త వరవడులు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ప్రసిద్ధ గజల్ విధ్వాంసులు తలత్ అజీజ్, పంకజ్ ఉదాస్‌లు ప్రేక్షకుల్లో కూర్చొని సోనూ నిగమ్ మీద ప్రశంసలు కురిపించారు.
Advertisement
Advertisement