బిగ్‌బాస్‌ షోతో స్టార్‌డమ్‌.. రోడ్డుపై భిక్షాటన.. రూ.20 రావడంతో.. | Kavin: I Turned into a Real Beggar Before Shooting for Bloody Beggar Movie | Sakshi
Sakshi News home page

యాచకుడిగా మారి రోడ్డుపై అడుక్కున్న హీరో.. ఆ తర్వాత..

Published Mon, Oct 14 2024 6:26 PM | Last Updated on Mon, Oct 14 2024 6:46 PM

Kavin: I Turned into a Real Beggar Before Shooting for Bloody Beggar Movie

సీరియల్స్‌ నుంచి సినిమాలవైపు అడుగులు వేశాడు హీరో కెవిన్‌. తమిళ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొని రూ.5 లక్షలతో షో నుంచి బయటకు వచ్చేశాడు. ఈ రియాలిటీ షో తర్వాత కెవిన్‌కు బోలెడంత పాపులారిటీ వచ్చింది. అప్పటిదాకా నటుడిగా చిన్నాచితకా పాత్రలు చేసిన ఇతడు ఒక్కసారిగా హీరో అయ్యాడు.

యాచకుడిగా మారిన హీరో
నాట్పున ఎన్నను తెరియుమా, లిఫ్ట్‌, దాదా, స్టార్‌ వంటి చిత్రాలు చేశాడు. ప్రస్తుతం ఇతడు నటించిన బ్లడీ బెగ్గర్స్‌ మూవీ దీపావళికి రెడీ అవుతోంది. శివబాలన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని జైలర్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. తాజాగా కెవిన్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. బ్లడీ బెగ్గర్‌ సినిమా కోసం నిజంగానే యాచకుడిగా మారాడు.

దానం చేసిన యువతి
కెవిన్‌ మాట్లాడుతూ.. నేను భిక్షగాడి గెటప్‌ వేసుకుని రోడ్డుపైకి వెళ్లాను. నన్నెవరైనా గుర్తుపడతారా? లేదా? యాచకుడినే అని నమ్ముతారా? అనుమానిస్తారా? టెస్ట్‌ చేద్దామనుకున్నాను. కానీ ఒకమ్మాయి నాకు రూ.20 దానం చేసింది. అప్పుడు నా లుక్‌పై నమ్మకం పెరిగింది. అలా ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభించాము అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ప్రేరణపై పగబట్టిన పృథ్వీ.. నామినేషన్స్‌లో తనూ ఉండాల్సిందేనంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement